వాళ్లని కృష్ణానదిలో ముంచితే పాపం పోయి పుణ్యం వస్తుందంటున్న చంద్రబాబు

By rajesh yFirst Published 11, Sep 2018, 9:04 PM IST
Highlights

 బీజేపీపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో విభజన సమస్యలపై ప్రసంగించిన చంద్రబాబు కేంద్రం ఆంధ్రప్రదేశ్ ను మోసం చేసిందని ఆరోపించారు. 

అమరావతి: బీజేపీపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో విభజన సమస్యలపై ప్రసంగించిన చంద్రబాబు కేంద్రం ఆంధ్రప్రదేశ్ ను మోసం చేసిందని ఆరోపించారు. తెలంగాణ విషయంలో అన్ని రకాలుగా సర్దుకు పోయేందుకు ప్రయత్నించానని కానీ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేసిందని విమర్శించారు. తెలంగాణలో మాట కూడా చెప్పకుండా పొత్తు లేదని బీజేపీ ప్రకటించిందన్న చంద్రబాబు బీజేపీతో పొత్తు లేదని చెప్పినప్పుడే కుట్ర అర్థమయ్యిందన్నారు. 

అమరావతి రాజధాని నిర్మాణంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. రాజధానికి ముంపు వస్తుందని అస్యత ప్రచారం చేయోద్దని హితవు పలికారు. అసెంబ్లీలో వర్షం వస్తుందని గొడుగులు రెయిన్ కోట్లు వేసుకొస్తారా అంటూ బీజేపీ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. బీజేపీ నేతలను కృష్ణానదిలో 3సార్లు ముంచితే పాపం పోయి పుణ్యం వస్తుందన్నారు. రాజధాని నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం విషం కక్కుతోందని మండిపడ్డారు. 

Last Updated 19, Sep 2018, 9:23 AM IST