జనసేన పార్టీ తొలి అభ్యర్థి ఎవరో తెలుసా...

By rajesh yFirst Published Sep 11, 2018, 4:51 PM IST
Highlights

2019 ఎన్నికలకు తాము రెడీ అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంకేతాలిచ్చారు. ఇప్పటికే 2019 ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ పదేపదే చెప్తున్న జనసేనాని తొలి అభ్యర్థిని సైతం ప్రకటించి అన్ని పార్టీల కంటే ఒక అడుగు ముందుకు వేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన తరుపు‌న పోటీ చేసే మొదట అభ్యర్థిని పవన్ కల్యాణ్ ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం‌ అభ్యర్థిగా ఇటీవలే పార్టీలో చేరిన పితాని బాలకృష్ణకు టిక్కెట్ కేటాయించినట్లు వెల్లడించారు.

హైదరాబాద్: 2019 ఎన్నికలకు తాము రెడీ అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంకేతాలిచ్చారు. ఇప్పటికే 2019 ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ పదేపదే చెప్తున్న జనసేనాని తొలి అభ్యర్థిని సైతం ప్రకటించి అన్ని పార్టీల కంటే ఒక అడుగు ముందుకు వేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన తరుపు‌న పోటీ చేసే మొదట అభ్యర్థిని పవన్ కల్యాణ్ ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం‌ అభ్యర్థిగా ఇటీవలే పార్టీలో చేరిన పితాని బాలకృష్ణకు టిక్కెట్ కేటాయించినట్లు వెల్లడించారు.  

జనసేన పార్టీ తొలి టిక్కెట్ ప్రకటించడంతో ఇతర పార్టీలు సైతం అప్రమత్తమయ్యాయి. అన్ని పార్టీలు రాజకీయ సమీకరణాలను అంచనా వేసుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్రమంతా తిరిగేస్తున్న పవన్  కళ్యాణ్ పర్యటన పూర్తయ్యే లోపు అభ్యర్థులను ఖరారు చేస్తారన్న ప్రచారం ఉంది. మరోవైపు పార్టీ టిక్కెట్ ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతారని పరోక్షంగా సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది. 

click me!