రిజల్ట్ డే... ఏపీ పరిషత్ ఎన్నికల ఓట్లలెక్కింపు ప్రారంభం

By Arun Kumar PFirst Published Sep 19, 2021, 8:28 AM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితమే ప్రారంభమయ్యింది. మరికొద్ది గంటల్లో ఫోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం భయటపడనుంది.  

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 7,220 స్థానాల్లో పోటీపడ్డ  18,782 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 206 కేంద్రాల్లో, 958 హాళ్లలో కౌంటింగ్​కు ఏర్పాట్లు చేశారు అధికారులు.

ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ ఐఎఎస్ అధికారుల పరీశీలకులుగా వ్యవహరించనున్నారు. ఇక కౌంటింగ్ హాళ్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసి ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చేశారు. అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు.  

read more  పరిషత్ ఎన్నికల కౌంటింగ్: గుంటూరు జిల్లాలో సర్వం సిద్ధం.. లెక్కింపు కేంద్రాలు ఇవే

​మొత్తం రాష్ట్రంలో 10,047 ఎంపీటీసీ స్థానాలకుగానూ వివిధ కారణాలతో 375 చోట్ల ఎన్నికలు జరగలేవు. మిగతా 9,672 స్థానాలకుగానూ 2,371 చోట్ల ఏకగ్రీవవమయ్యాయి. 81 మంది అభ్యర్థులు మృతి చెందారు. ఇక రాష్ట్రంలోని 660 జెడ్పీటీసీ స్థానాలకుగానూ 8 చోట్ల ఎన్నిక నిలిచిపోగా 652 స్థానాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇందులోనూ 126 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 11 మంది అభ్యర్ధులు మృతిచెందారు. 515 చోట్ల మాత్రమే జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ స్థానాల్లో 2058 అభ్యర్థులు ఫోటీచేశారు.

గుంటూరు  జిల్లాలో 571 ఎంపీటీసీ, 45 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. చాలారోజుల క్రితం పోలింగ్ జరగ్గా ఇన్నాళ్లూ హైకోర్టు ఆదేశాలతో ఫలితాలు ప్రకటించలేదు. అయితే హైకోర్టు నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రపరిచిన బ్యాలెట్లలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం జిల్లావ్యాప్తంగా 14 కేంద్రాల్లో 598 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 

click me!