దివ్యాంగుడన్న కనికరం లేకుండా కర్రలతో చితకబాది.. తిరుపతిలో లోన్ రికవరి ఏజెంట్ల దాష్టీకం

Siva Kodati |  
Published : Aug 02, 2022, 04:18 PM IST
దివ్యాంగుడన్న కనికరం లేకుండా కర్రలతో చితకబాది.. తిరుపతిలో లోన్ రికవరి ఏజెంట్ల దాష్టీకం

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ఫైనాన్స్ ఏజెంట్ల ఆగడాలు శృతిమించుతున్నాయి. తాజాగా తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఓ దివ్యాంగుడిని లోన్ రికవరీ ఏజెంట్లు కర్రలతో చితకబాదారు. 

ప్రైవేట్ ఫైనాన్స్ ఏజెంట్ల ఆగడాలు నానాటికీ తీవ్రమవుతున్నాయి. తాజాగా తిరుపతి జిల్లా నాయుడుపేటలో దారుణం జరిగింది. స్థానికంగా నివసిస్తోన్న దివ్యాంగుడిపై ఫైనాన్స్ ఏజెంట్లు దాడి చేశారు. దివ్యాంగుడని కూడా చూడకుండా కర్రలతో అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు ఏజెంట్లు వెంకట్, దేవా. ఫైవ్ స్టార్ అనే ఫైనాన్స్ సంస్థలో రూ.3.5 లక్షల రుణం తీసుకున్నాడు గోవిందు అనే దివ్యాంగుడి సోదరుడు. ఈ నేపథ్యంలో లోన్ రికవరీ కోసం వచ్చిన ఏజెంట్లు తమ అన్న ఇంట్లో లేడని చెబుతున్నా వినకుండా చితకబాదారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో గోవిందు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం