Visakhapatnam : ఈ యాక్సిడెంట్ మందుబాబులకు యమ కిక్కిచ్చింది... ఎగబడిపోయారుగా...

Published : Nov 12, 2023, 06:53 AM ISTUpdated : Nov 12, 2023, 07:06 AM IST
Visakhapatnam : ఈ యాక్సిడెంట్ మందుబాబులకు యమ కిక్కిచ్చింది... ఎగబడిపోయారుగా...

సారాంశం

మద్యం ప్రియులకు ఎలాంటి ఖర్చు లేకుండానే కిక్కు ఎక్కే ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది.  రోడ్డుపై మందుబాటిళ్లు ఉచితంగాానే దొరుకుతున్నట్లు తెలిసి ప్రజలు ఎగబడ్డారు. 

విశాఖపట్నం : ఏదయినా రోడ్డు ప్రమాదం జరిగితే ఎవరికి ఏమయ్యిందోనని అందరూ కంగారుపడతారు... కానీ విశాఖపట్నంలో జరిగిన ఓ యాక్సిడెంట్ మందుబాబుల కళ్లలో ఆనందం నింపింది. మద్యం లోడ్ తో వెళుతున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడిన దుర్ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. దీంతో కాటన్ల కొద్ది మందుబాటిళ్లు రోడ్డుపై పడిపోయాయి. ఇంకేముంది లారీలోని వారికి ఏమైనా అయ్యిందా... అతడిని ఏదైనా సహాయం అవసరమా అని ఎవరూ ఆలోచించలేదు... రోడ్డుపై పడిపోయిన మందుబాటిళ్ల కోసం మాత్రం ఎగబడ్డారు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆనందపురం నుండి విశాఖ నగరం వైపు మద్యం లోడ్ తో వెళుతున్న లారీ ప్రమాదానికి గురయ్యింది. మధురవాడ పరిధిలో వేగంగా వెళుతున్న లారీ మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో లారీ ఒక్కసారిగా బోల్తాపడి అందులోని మద్యం కాటన్లు రోడ్డుపై పడిపోయాయి. ఇలా రోడ్డుపై పడిపోయిన మద్యం బాటిళ్లను చూసి స్థానికులు,  వాహనదారులు ఆగలేకపోయారు. ఒక్కసారిగా ఎగబడి అందినకాడికి మద్యం బాటిళ్లను తీసుకుని వెళ్లిపోయారు.

క్షణాల్లో ఈ యాక్సిడెంట్ వార్త విశాఖపట్నం మొత్తం వ్యాపించింది. దీంతో ఎక్కడెక్కడి నుండో జనం తరలివచ్చి ఒక్కొక్కరు రెండుమూడు బాటిళ్లు ఎత్తుకెళ్ళిపోయారు. కొద్దిసేపటి తర్వాత విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు మందుబాటిళ్ల కోసం ఎగబడ్డ జనాలను కంట్రోల్ చేసారు. ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై పడ్డ మద్యం బాటిళ్లను తొలగించి వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చూసారు. 

Read More  తిరుమల నుంచి రెడ్ శాండల్ అక్రమరవాణా.. ఎక్కడికంటే..

అయితే పోలీసుల ఎంట్రీకి ముందు మాత్రం యాక్సిడెంట్ ప్రాంతమంతా జనాలతో కిక్కిరిసింది. ఎవరి చేతికి అందిన మందు బాటిల్ ను వారు తీసుకెళ్లారు. లారీ డ్రైవర్ పరిస్థితేమిటీ? అతడికి ఏమయినా అయ్యిందా? అని ఆలోచించే వారే లేకుండా పోయారు. ఇలా ఉచితంగా దొరుకుతున్న మద్యం కోసం మానవత్వాన్నే మరిచారు మందుబాబులు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్