ప్లాంట్‌లో మెటీరియల్‌ తీసుకుంటాం.. అనుమతివ్వండి: హైకోర్టుకెక్కిన ఎల్జీ పాలిమర్స్

By Siva KodatiFirst Published Apr 1, 2021, 7:16 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎల్జీ పాలిమర్స్ ఘటన మిగిల్చిన విషాదం అంతా కాదు. విష వాయువు విడుదల కావడంతో చాలా మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. 

తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎల్జీ పాలిమర్స్ ఘటన మిగిల్చిన విషాదం అంతా కాదు. విష వాయువు విడుదల కావడంతో చాలా మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు.

ఇక తాజాగా ఈ కేసులో ఎల్జీ పాలిమర్స్ హైకోర్టును ఆశ్రయించింది. కంపెనీలో ఉండిపోయిన రా మెటీరియల్ అమ్ముకోవాలని అందుకు అనుమతి ఇవ్వాలని ఎల్జీ పాలిమర్స్ న్యాయస్థానాన్ని కోరింది. ప్రమాదం జరిగిన నాటి నుండే కంపెనీ మూత పడిందని కంపెనీ ప్రతినిధులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

అలాగే కంపెనీ మూత పడిన నాటి నుండి అందులో విలువైన రా మెటీరియల్ ఉండిపోయిందని తెలిపారు. ఆ రా మెటీరియల్ అమ్మకానికి అనుమతులు ఇవ్వాలని ఎల్జీ పాలిమర్స్ న్యాయస్థానాన్ని కోరింది.

ఇందుకు ఏపీ ప్రభుత్వం కూడా మద్దతు తెలిపింది. ఆ మెటీరియల్ చాలా ప్రమాదకరం అని పేర్కొన్న ప్రభుత్వం, నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని న్యాయస్థానానికి తెలియజేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది 

click me!