తిరుమలలో చిక్కిన చిరుత.. పిల్లిని వేటాడుతూ వచ్చి, బాలుడిపై దాడి...

Published : Jun 24, 2023, 07:23 AM ISTUpdated : Jun 24, 2023, 07:24 AM IST
తిరుమలలో చిక్కిన చిరుత.. పిల్లిని వేటాడుతూ వచ్చి, బాలుడిపై దాడి...

సారాంశం

మూడేళ్ల బాలుడు కౌశిక్ మీద దాడి చేసిన చిరుతను అటవీ అధికారులు బంధించారు. బోను ఏర్పాటు చేసిన ఆరు గంటల్లోనే చిరుతను బంధించారు. 

తిరుపతి : తిరుమల అలిపిరి నడకమార్గంలో బాలుడు కౌశిక్ మీద దాడి చేసిన చిరుత బోనులో చిక్కింది. బోను ఏర్పాటు చేసిన ఆరు గంటల్లోనే చిరుతను పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ, టీటీడీ అటవీ శాఖ సంయుక్తంగా చిరుతను పట్టుకోవడానికి కృషి చేశారు. దీనిమీద తిరుమల ఏఎఫ్వో మాట్లాడుతూ.. దాడి జరిగిన రోజు రాత్రే సీన్ రీకన్ స్ట్రక్షన్ చేసి, చిరుత అడుగుజాడల మీద ఓ అంచనాకు వచ్చాం. అందులో భాగంగానే.. అలిపిరినుంచి గాలి గోపరం వరకు చిరుత ఎక్కువగా సంచరిస్తున్నట్లు గుర్తించి.. ఆయా ప్రాంతాల్లో రెండు బోనులు ఏర్పాటు చేశాం.

బోనులు ఏర్పాటు చేసిన ఆరుగంటల్లోనే చిరుత అందులో చిక్కింది. దీనికోసం 150 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఆరు గంటల వ్యవధిలోనే చిరుతను బంధించారు అధికారులు. రాత్రి 10:45గం.ల సమయంలో.. ఒకరోజులోనే చిరుతను బంధించారు.

తిరుమలలో చిరుతదాడి : బాలుడు కౌశిక్ క్షేమం.. ప్రాణాపాయం లేదు... ఈవో ధర్మారెడ్డి

ఈ చిరుత సంవత్సరన్నర కూన. దీనివల్ల దీనికి వేటసరిగా రాదు. మామూలుగా చిరుతలు మనుషుల మీద దాడి చేయవు. ఇది పిల్లిని తరుముతూ వెళ్లి.. బాలుడి మీద దాడి చేసింది. పిల్లిని తరుముతూ వెళ్లే క్రమంలో.. మెట్లమీదినుంచి నడుస్తూ వెడుతున్న బాలుడిని.. పిల్లిగా భ్రమించి.. లాక్కెళ్లింది. అంతేకానీ.. బాలుడి మీద దాడి అనేది చిరుత వాంటెడ్లీ చేసింది కాదనేది మా అనుభవం మీద చెబుతున్న విషయం.

సబ్ రల్ట్ చిరుత...మగ చిరుత. దాన్ని కొద్ది రోజుల తరువాత సురక్షితంగా అడవిలో వాటి సురక్షితమైన ప్రదేశంలో వదిలేస్తాం. చిరుత పట్టుబడిన చోట.. చిరుత కూన, దాని తల్లి ఉన్నట్టుగా గుర్తించాం. తల్లి కూడా భక్తుల మీద ఎప్పుడూ, ఎలాంటి దాడులు చేయలేదు. కాబట్టి భక్తులు భయపడాల్సిన భయం లేదు. తల్లీబిడ్డ రెండు చిరుతలు వన్యప్రాణులను మాత్రమే వేటాడుతాయి. బాలుడి మీద దాడి చేయడానికి కొద్ది రోజుల ముందు నుంచి చిరుత ఆకలితో ఉండడంతో పిల్లిని వేటాడుతూ... బాలుడిని చూసింది. బాలుడు చిన్నవాడు..అతని తలను చూసి మరో పిల్లి అనుకుని లాక్కెళ్లింది... అని చెప్పారాయన. 

డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ అఫీసర్ సతీష్ మాట్లాడుతూ... మనుషుల మీద దాడి చేయడం చాలా రేర్ అన్నారు. ఇక్కడ చిరుతలు 50పైగా ఉంటాయి. భక్తులు తగు జాగ్రత్తలు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. దీనికి మేము కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. గాలి గోపురం దగ్గరినుంచి.. లక్ష్మి నరసింహగుడి దాకా.. కెమెరా ట్రాప్స్ పెట్టి.. కదలికలు గమనిస్తూ.. ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూస్తాం.. అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి
IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!