లెప్ట్ నేతలతో పవన్ మీటింగ్: పొత్తులపై మరోసారి భేటీ

By narsimha lodeFirst Published Jan 25, 2019, 3:37 PM IST
Highlights

న్నికల్లో ఎలా వెళ్లాలనే దానిపై  వామపక్ష నేతలతో  చర్చించినట్టు  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు.లెఫ్ట్ నేతలతో  పవన్ కళ్యాణ్  ఫిబ్రవరి మాసంలో మరోసారి సమావేశం కానున్నారు

విశాఖపట్టణం:  ఎన్నికల్లో ఎలా వెళ్లాలనే దానిపై  వామపక్ష నేతలతో  చర్చించినట్టు  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు.లెఫ్ట్ నేతలతో  పవన్ కళ్యాణ్  ఫిబ్రవరి మాసంలో మరోసారి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

శుక్రవారం నాడు సీపీఐ, సీపీఎం జాతీయ నాయకులతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  విశాఖపట్టణంలో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో  రాష్ట్రంలో నెలకొన్న పలు అంశాలపై చర్చించారు.ఈవీఎంల టాంపరింగ్ అంశంపై కూడ ఈ సమావేశంలో చర్చించినట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు.  

కొంత కాలంగా  మేం వామపక్షాలతో కలిసి పనిచేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే ఎన్నికల్లో పొత్తుల ముందు కొన్ని అంశాలపై ఏకాభిప్రాయానికి రావడానికి సమావేశం నిర్వహించినట్టు చెప్పారు.ఫిబ్రవరి మాసంలో మరోసారి సమావేశం కానున్నట్టు పవన్ కళ్యాణ్ తెలిపారు.  

పర్యావరణ పరిరక్షణ అనేది తక్షణ అవసరంగా ఈ సమావేశంలో చర్చించినట్టు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తెలిపారు. మైనింగ్ కారణంగా పర్యావరణ సమస్యలు తలెత్తినట్టు ఆయన గుర్తు చేశారు.

ఈవీఎంలపై వచ్చిన అనుమానాలను తీర్చాల్సిన అనుమానాలను తీర్చాలని సురవరం సుధాకర్ రెడ్డి  కోరారు. ఈ విషయమై ఎన్నికల కమిటీ ఓ నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి రాజకీయపార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి అనుమానాలను తీర్చాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణ ఎన్నికల్లో  పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు మధ్య తేడా ఉందన్నారు. అయితే అదే సమయంలో గెలుపు ఓటములపై ప్రభావం చూపించిందని సురవరం సుధాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర రాజకీయాల్లో  అనుసరించాల్సిన  వ్యూహంపై కూడ మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు చెప్పారు.ప్రజా సమస్యల పరిష్కారంపై పోరాడే విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్టు చెప్పారు.పర్యావరణం, పౌరహక్కులు, సామాజిక న్యాయం విషయంలో పోరాటంపై చర్చించామని రాఘవులు చెప్పారు.

click me!