జగన్ గ్రౌండ్ లెవల్ వ్యూహం: ఫిబ్రవరి 4 నుండి ప్రారంభం

By narsimha lodeFirst Published Jan 25, 2019, 3:16 PM IST
Highlights

 రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేసేందుకు జగన్‌ బూత్‌లెవల్ పార్టీ కార్యకర్తల సమావేశాల్లో  జగన్‌  పాల్గొననున్నారు


అమరావతి:  రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేసేందుకు జగన్‌ బూత్‌లెవల్ పార్టీ కార్యకర్తల సమావేశాల్లో  జగన్‌  పాల్గొననున్నారు.సమరశంఖారావం  పేరుతో  ఈ కార్యక్రమాన్ని  ప్రారంభించనున్నారు. చిత్తూరు జిల్లా నుండి ఈ కార్యక్రమాన్ని  జగన్  ఫిబ్రవరి 4వ తేదీన  జగన్ ప్రారంభిస్తారు.

ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి మొదటి వారంలో  ఏపీలో  ఎన్నికల షెడ్యూల్  వెలువడే అవకాశం ఉందని  ప్రచారం సాగుతోంది. దీంతో  క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు జగన్ ప్రణాళికలను సిద్దం చేశారు.

పాదయాత్ర తర్వాత బస్సు యాత్ర చేస్తారని  భావించినప్పటికీ కూడ బూత్‌ లెవల్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని జగన్  భావిస్తున్నారు. ఈ తరుణంలోనే రాయలసీమ జిల్లాల్లో తొలుత సమరశంఖారావం పేరిట జిల్లాల పర్యటనలు చేయనున్నారు.

ఫిబ్రవరి 4వ తేదీన చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ పార్టీకి చెందిన బూత్ లెవల్ కార్యకర్తలతో జగన్ భేటీ కానున్నారు. ఫిబ్రవరి 5వ తేదీన కడప, ఫిబ్రవరి 6వ తేదీన అనంతపురం జిల్లాలకు చెందిన నేతలతో  ఆయన సమావేశం అవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఫిబ్రవరి 14వ తేదీన అమరావతిలో వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవం  చేసే అవకాశం ఉంది.అదే సమయంలో  కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన బూత్‌ లెవల్ కార్యకర్తలతో  జగన్ భేటీ అయ్యే అవకాశం ఉంది. అనంతపురం జిల్లా తర్వాత  కర్నూల్, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన వైసీపీ కార్యకర్తలతో జగన్ భేటీ కానున్నారు.  

తొలుత రాయలసీమ జిల్లాల పార్టీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల్లో కూడ ఈ సమావేశాలను పూర్తి చేయనున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు జగన్ వెళ్లడం కంటే విజయవాడ కేంద్రంగా  ఆ పార్టీ నేతలతో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


 

click me!