బావిలోకి దూసుకెళ్లి నీటిలో మునిగిన లగేజీ వ్యాన్: డ్రైవర్, క్లీనర్ కాకుండా...

Published : Mar 30, 2021, 08:41 AM IST
బావిలోకి దూసుకెళ్లి నీటిలో మునిగిన లగేజీ వ్యాన్: డ్రైవర్, క్లీనర్ కాకుండా...

సారాంశం

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు తెల్లవారు జామున ప్రమాదం జరిగింది. ఓ లగేజీ వ్యాన్ అదుపు తప్పి రొడ్డు పక్కన గల బావిలో పడిపోయింది. వ్యాన్ లో ఎంత మంది ఉన్నారనే స్పష్టత రావడం లేదు.

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఓ లగేజీ వ్యాన్ రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. వ్యాన్ నీటిలో మునిగిపోయింది. వ్యాన్ లో డ్రైవర్, క్లీనర్ కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఈ ప్రమాదం శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి మండలం పాకివలస గ్రామం సమీపంలో జరిగింది.

సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బావిలోని నీటిని తోడిస్తున్నారు. బావిలోని నీటిని తోడేసిన తర్వాత వ్యాన్ లో ఎంత మంది ఉన్నారనే స్పష్టత వస్తుంది. మంగళవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అదుపు తప్పి వ్యాన్ బావిలోకి దూసుకెళ్లింది.

వివరాలు అందాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!