లగడపాటి ఎన్నికల సర్వే.. ఎప్పుడంటే..

First Published Jul 30, 2018, 10:10 AM IST
Highlights

2019 ఎన్నికలు కూడా దగ్గరపడుతుండటంతో.. ఆయన సర్వే పై సర్వత్రా ఆసక్తి మొదలైంది. కాగా.. ఈ సర్వే ఎప్పుడు విడుదల చేసేదానిపై లగడపాటి క్లారిటీ ఇచ్చారు.

విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజ గోపాల్..  నిర్వహించే ఎన్నికల సర్వే 90శాతం నిజమౌతుంది. అందుకే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. ఆయన సర్వే కోసం రాజకీయనాయకులంతా ఎదురుచూస్తుంటారు. 2019 ఎన్నికలు కూడా దగ్గరపడుతుండటంతో.. ఆయన సర్వే పై సర్వత్రా ఆసక్తి మొదలైంది. కాగా.. ఈ సర్వే ఎప్పుడు విడుదల చేసేదానిపై లగడపాటి క్లారిటీ ఇచ్చారు.

ఆదివారం అనంతపురం జిల్లా పెనుకొండ మండలం కోనాపురంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయనఈ విషయం గురించి తెలిపారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని.. ఎన్నికల సర్వే వివరాలు ఎన్నికలకు ముందుగా విడుదల చేస్తానని చెప్పారు.   అదేవిధంగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ..ప్రాణ త్యాగాలు, ఆత్మ బలిదానాలతో ప్రత్యేకహోదా రాదని.. పోరాటాల ద్వారానే ప్రత్యేకహోదా సాధ్యమన్నారు.

రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తే పరిశ్రమలు, తద్వారా ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రజలు ఇదే విషయాన్ని బలంగా విశ్వసిస్తున్నారన్నారు. ప్రత్యేకహోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్రాన్ని విభజించినందుకే ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి బుద్ధి చెప్పారని, ప్రత్యేకహోదా ఇవ్వకపోతే రానున్న ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి అదే గతి పడుతుందన్నారు. 

click me!