చంద్రబాబుతో లగడపాటి, ఎబీఎన్ రాధాకృష్ణ సీక్రెట్ టాక్స్

Published : Jan 29, 2019, 04:37 PM ISTUpdated : Jan 29, 2019, 07:11 PM IST
చంద్రబాబుతో లగడపాటి, ఎబీఎన్ రాధాకృష్ణ సీక్రెట్ టాక్స్

సారాంశం

సర్వేలు చేయడంలో అందె వేసిన చేయి అయిన లగడపాటి చంద్రబాబు కోసం సర్వేలు చేస్తూ వాటిని సరిదిద్దే విషయంపై సలహాలు ఇస్తున్నారనే మాట వినిపిస్తోంది. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో ఆంధ్ర ఆక్టోపస్, మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ రహస్య చర్చలు జరిపారు. ఆయనతో పాటు ఎబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కూడా చంద్రబాబును కలిశారు. 

వారు ముగ్గురు జరిపిన రహస్య మంతనాలు ఏమిటనేది బయటకు రాలేదు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు చంద్రబాబును కలవడానికి వచ్చిన మాజీ పార్లమెంటు సభ్యుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వచ్చిన రోజునే వారు కూడా రావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. 

తెలంగాణ శానససభ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ సర్వేలు ఇచ్చి లగడపాటి రాజగోపాల్ విమర్శల పాలయ్యారు. ఆ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాల వెల్లడి వెనక చంద్రబాబు ఉన్నట్లు అప్పట్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. సర్వేలు చేయడంలో అందె వేసిన చేయి అయిన లగడపాటి చంద్రబాబు కోసం సర్వేలు చేస్తూ వాటిని సరిదిద్దే విషయంపై సలహాలు ఇస్తున్నారనే మాట వినిపిస్తోంది. 

ఎక్కడ ఏ విధమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలనే విషయంపై చంద్రబాబు రాధాకృష్ణ సూచలను కూడా అడిగి తెలుసుకున్నట్లు చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగించి, అమరావతిలో స్థిర నివాసం ఏర్పరుచుకుని మరింత దూకుడుగా ముందుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ స్థితిలో చంద్రబాబు లగడపాటి, రాధాకృష్ణలతో చర్చలు జరపడం రాజకీయంగా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నట్లు చెబుతున్నారు. 

 

asianet news special

షార్ట్ ఫిలిమ్స్ చేసి కష్టపడి పైకొచ్చిన తెలుగు యువ దర్శకులు!

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?