టెక్కీ భువనేశ్వరితో ఆడుకున్న మగాళ్లు: భర్త చేతిలో హత్య, మరో ఇద్దరు దారుణంగా

By telugu teamFirst Published Jul 3, 2021, 1:06 PM IST
Highlights

భర్త చేతిలో హత్యకు గురైన టెక్కీ భువనేశ్వరి జీవితం బాల్యం నుంచి కూడా ముళ్లమీద నడకే అయింది. అడుగడుగునా ఆమెను మగాళ్లు మోసం చేస్తూ వచ్చారు. చివరకు భర్త చంపేశాడు.

తిరుపతి: భర్త శ్రీకాంత్ రెడ్డి చేతిలో హత్యకు గురైన మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు భువనేశ్వరితో మగాళ్లు ఆడుకున్నారు. భువనేశ్వరిని హత్య చేసి తిరుపతిలో రుయా ఆస్పత్రి వెనక భర్త శ్రీకాంత్ రెడ్డి కాల్చేసిన విషయం తెలిసిందే. శ్రీకాంత్ రెడ్డి ఏకంగా ఆమె ప్రాణాలనే తీస్తే మరో ఇద్దరు మగాళ్లు ఆమె జీవితంతో ఆడుకున్నారు. బాల్యం నుంచే ఆమె సమస్యలను ఎదుర్కుంటూ పట్టుబట్టి చదువు సాగించి సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేసే స్థాయికి ఎదిగింది. 

ఆంధ్రప్రదేశ్ రా,్ట్రంలోని చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన సరోజమ్మ, మునివెంకటప్ప దంపతుల ఐదో కూతురు భువనేశ్వరి. ఆ భార్యాభర్తలకు ఎనిమిది మంది సంతానం. వారిలో ఇద్దరు మగ పిల్లలు కాగా, ఆరుగురు ఆడపిల్లలు. కూలీపనులు చేసే భార్యాభర్తలు పిల్లలను పోషించడానికి పడరాని పాట్లు పడ్డారు. 

భువనేశ్వరి చదువులో చురుగ్గా ఉండేది. ఏడో తరగతి చదువుతున్న సమయంలో గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆమెను ఎత్తుకెళ్లి రెండేళ్ల పాటు లైంగికంగా వేధించి గ్రామంలో వదిలేశాడు. ఆ యువకుడి దుర్మార్గాన్ని తల్లిదండ్రులు గానీ గ్రామస్తులు గానీ ప్రశ్నించలేని స్థితి ఉంది. దాంతో భువనేశ్వరి దాన్ని మౌనంగా భరించి చదువు సాగించింది. చివరకు ఇంజనీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా స్థిరపడింది. 

ఉద్యోగం చేస్తున్న క్రమంలో ప్రేమ పేరుతో ఓ యువకుడు ఆమెకు చేరువయ్యాడు. అయితే, అతను ఆమె నుంచి డబ్బులు లాగుతూ వచ్చాడు. దాంతో భువనేశ్వరి అతన్ని దూరం పెట్టింది. అయితే, తనలాంటి వారికి న్యాయం జరగాలనే కోరిత సోషల్ మీడియాలో భువనేశ్వరి ఓ ఉద్యమాన్ని నడిపింది. ఆమెకు ఎంతో మంది ధైర్యం చెప్పారు, ఆమెకు అండగా నిలిచారు 

ఆమె ఉద్యమానికి సహాయం చేస్తూ ఆ సమయంలో మారంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆమెకు చేరువయ్యాడు. మోటివేషన్ క్లాసులు చెబుతూ, సూటూబూటూ వేసుకని తిరుగుతూ కనిపించిన శ్రీకాంత్ రెడ్డి  మాటలు నమ్మింది. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. 

భువనేశ్వరికి నెలకు 90 వేల రూపాయల వేతనం వస్తుంది. ఆ డబ్బులపై శ్రీకాంత్ రెడ్డి కన్నేశాడు. మూడేళ్ల క్రితం ఇరువురు పెళ్లి చేసుకున్నారు భువనేశ్వరి హైదరాబాదులోని మియాపూర్ లో ఇల్లు కొనుక్కుంది. ఈ క్రమంలోనే శ్రీకాంత్ రెడ్డి అసలు రూపం బయటపడుతూ వచ్చింది. జల్సాలు చేస్తూ అప్పులు చేస్తూ ఆమెను డబ్బుల కోసం వేధిస్తూ వచ్చాు.డు. ఇటీవల బంధువుల వద్ద రూ. 10 లక్షులు తెచ్చి అతనికి ఇచ్చింది. ఆమె పీఎఫ్ డబ్బులు, బంగారం కూడా అతని చేతిలో ఆవిరయ్యాయి. పద్ధతి మార్చుకోవాలని చెప్పిన భార్య భువనేశ్వరిని గొంతు నులిమి చంపేశాడు. 

కరోనా వేరియంట్ తో భువనేశ్వరి మరణించిందని నాటకమాడాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. అయితే, సుఖమనేది ఎరుగని భువనేశ్వరి జీవితం మాత్రం విషాదాంతమే అయింది.   

click me!