గుంటూరు జిల్లా, దుగ్గిరాల ఫేస్-1 లే అవుట్లో మెగా గ్రౌండింగ్ మేళా ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం 10.30 గంటలకు దుగ్గిరాల గ్రామంలో ఏర్పాటు చేసిన లే అవుట్ లో ఎమ్మెల్యే ఆర్కే భూమి పూజలకు హాజరయ్యారు.
దుగ్గిరాల ఫేస్-1 లే అవుట్లో మెగా గ్రౌండింగ్ మేళా ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం 10.30 గంటలకు దుగ్గిరాల గ్రామంలో ఏర్పాటు చేసిన లే అవుట్ లో ఎమ్మెల్యే ఆర్కే భూమి పూజలకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవ్వరు ఇళ్ళు లేని నిరుపేదలు ఉండకూడదని గౌరవ ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి ఆశయం అన్నారు.
రాష్ట్రంలో దాదాపు 30 లక్షల ఇళ్లను పేదల కోసం నిర్మించి ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం అని ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ రోజు దుగ్గిరాల లే అవుట్-1 లో దాదాపు 1300 ల ఇళ్లకు శంకుస్థాపనలు చేయటం జరిగిందని అన్నారు. రానున్న వర్షాకాలంలోపల ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులు భావిస్తున్నారని, ఇందుకు అధికారులు కచ్చితంగా సహకరించటానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.