పరిగి తహసిల్దార్ కార్యాలయంలో యువకుడు ఆత్మహత్యాయత్నం !

By AN TeluguFirst Published Jul 3, 2021, 10:33 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలోని పరిగి తహసిల్దార్ కార్యాలయంలో ఓ యువకుడి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. జగన్ ప్రభుత్వంలో ఓసీలకు న్యాయం జరగడం లేదని, స్థానికంగా ఉన్న మంత్రులు ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా ఓసీలకు న్యాయం చేయడం లేదని ఆ యువకుడు ఆరోపిస్తున్నాడు. 

ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలోని పరిగి తహసిల్దార్ కార్యాలయంలో ఓ యువకుడి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. జగన్ ప్రభుత్వంలో ఓసీలకు న్యాయం జరగడం లేదని, స్థానికంగా ఉన్న మంత్రులు ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా ఓసీలకు న్యాయం చేయడం లేదని ఆ యువకుడు ఆరోపిస్తున్నాడు. 

ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో కూడా అర్హులైన ఓసీలకు అన్యాయం జరుగుతుందని మనస్తాపం చెంది పురుగుల మందు సేవించి శాసన కోట కు చెందిన యువకుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. 

వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి కుమారుడు నవీన్ కుమార్ శుక్రవారం ఉదయం తహసిల్దార్ కార్యాలయంలోని చాంబర్ వద్దకు చేరుకొని  ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

అక్కడ ఉన్న సిబ్బంది తదితరులు అడ్డుకొని వెంటనే హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నవీన్ కుమార్ ఆరోగ్యంగా ఉన్నాడని డాక్టర్లు తెలిపారు. నవీన్ కుమార్ ఓసీలకు జరుగుతున్న  అన్యాయాన్ని వివరిస్తూ ముఖ్యమంత్రి దగ్గర నుండి మంత్రుల వరకు ఓసీలు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

తన ఆవేదన అంతా ఒక లేఖలో వివరిస్తూ తహసిల్దార్ సౌజన్య లక్ష్మికి అందించాలనే ఉద్దేశంతో కార్యాలయానికి వెళ్లి ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఈ విషయం పై స్పందిస్తూ తాసిల్దార్ యువకుడు తనకేదో దరఖాస్తు అందించాలని హడావిడిగా వచ్చి ఒక్కసారిగా కింద పడ్డాడని ఆమె తెలిపారు.

తను తెచ్చుకున్న లేఖలో ఓసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ అర్జీ రూపంలో తన ఆవేదనను ముఖ్యమంత్రికి తెలియచేయాలని వచ్చినట్లు తెలిసింది. యువకుడు కింద పడడంతో హాస్పిటల్ తరలించామన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించామని ఆమె తెలిపారు.

click me!