
మంత్రి ఆది నారాయణరెడ్డిపై మహిళలు ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. నంద్యాల ఉపఎన్నిక ప్రచారంలో వైసీపీ ఎంఎల్ఏ రోజాకు మంత్రి అఖిలప్రియకు మధ్య మాటల యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే కదా? వారిద్దరి యుద్ధంలో మరో ఫిరాయింపు మంత్రి మంత్రి ఆదినారాయణరెడ్డి వేలు పెట్టారు. మహిళల మధ్య కట్టుబొట్టు, సంప్రదాయం లాంటి అనేక విషయాల్లో వాదులాటలు జరుగాయి. అయితే, ఆది ఫిరాయింపు మంత్రి అఖిలకు మద్దతుగా మాట్లాడుతూ, సినిమాల్లో బట్టలు కూడా లేకుండా నటించిన రోజా కూడా కట్టు, బొట్టు గురించి అఖిలను విమర్శించటమేంటని ఎద్దేవా చేసారు.
దాంతో పలువురు మహిళలు ఇపుడు ఆదిపై మండిపడుతున్నారు. తిరుపతికి చందిన మహిళలు పలువురు సోమవారం ఆదిపై మండిపడ్డారు. ఫిరాయింపు మంత్రిని దున్నపోతుతో పోల్చారు. అసలు రోజానే లక్ష్యంగా టిడిపి నేతలు ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారంటూ ధ్వజమెత్తారు. అంతేకాకుండా దున్నపోతులపై ఆదినారాయణరెడ్డి పేరు రాసి ఊరేగింపు కూడా జరిపారు. గతంలో ఇదే విధంగా హిందుపురంలో దున్నపోతులపై నందమూరి బాలకృష్ణ పేరు రాసి ఊరేగించిన సంగతి గుర్తుంది కదా? అదే విధంగా మంత్రి ఆదినారాయణరెడ్డి పేరు రాసి నిరసన తెలిపారు.