ఆందోళనలో ఫిరాయింపు ఎంఎల్ఏలు

Published : Aug 14, 2017, 08:01 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
ఆందోళనలో ఫిరాయింపు ఎంఎల్ఏలు

సారాంశం

ఇక్కడ గనక వైసీపీ గెలిస్తే దాని ప్రభావం తమ నియోజకవర్గాల్లో ఎక్కడ పడుతుందో అని ఆందోళన పడుతున్నారు. అందుకే ఫిరాయింపుల్లో చాలామంది ఎంఎల్ఏలు నంద్యాలలో మకాం వేసి ఎలాగైనా టిడిపినే గెలవాలని ప్రచారం చేస్తున్నారు. క్షేత్రస్ధాయిలో పరిస్దితి చూస్తే విరుద్దంగా ఉంది. చంద్రబాబునాయుడేమో పై నుండి టిడిపి ఎలాగైనా గెలవాలంటూ రోజూ క్లాసుల మీద క్లాసులు పీకుతున్నారు. దాంతో ఏం చేయాలో వీరికి దిక్కు తెలీటం లేదు. ఫిరాయింపు నియోజకవర్గంలో కాకుండా ఇంకెక్కడైనా ఉపఎన్నిక వచ్చివుంటే వీళ్ళల్లో ఈ ఆందోళన వుండేదికాదు.

నంద్యాల ఉపఎన్నిక ఫలితం మాట దేవుడెరుగు. టిడిపిలోని ఒక సెక్షన్ ఎంఎల్ఏల్లో ఆందోళన మాత్రం స్పష్టంగా తెలిసిపోతోంది. వారే ఫిరాయింపు ఎంఎల్ఏలు. వైసీపీ తరపున గెలిచి టిడిపిలోకి ఫిరాయించిన 20 మంది ఎంఎల్ఏల్లో రోజు రోజుకు టెన్షన్ పెరిగిపోతోంది. ఇపుడు జరుగుతున్న నంద్యాల ఉపఎన్నిక కూడా ఫిరాయింపు నియోజకవర్గం కాబట్టే వీళ్ళల్లో అంతటి టెన్షన్. ఇక్కడ గనక వైసీపీ గెలిస్తే దాని ప్రభావం తమ నియోజకవర్గాల్లో ఎక్కడ పడుతుందో అని ఆందోళన పడుతున్నారు. అందుకే ఫిరాయింపుల్లో చాలామంది ఎంఎల్ఏలు నంద్యాలలో మకాం వేసి ఎలాగైనా టిడిపినే గెలవాలని ప్రచారం చేస్తున్నారు.

క్షేత్రస్ధాయిలో పరిస్దితి చూస్తే విరుద్దంగా ఉంది. చంద్రబాబునాయుడేమో పై నుండి టిడిపి ఎలాగైనా గెలవాలంటూ రోజూ క్లాసుల మీద క్లాసులు పీకుతున్నారు. దాంతో ఏం చేయాలో వీరికి దిక్కు తెలీటం లేదు. ఫిరాయింపు నియోజకవర్గంలో కాకుండా ఇంకెక్కడైనా ఉపఎన్నిక వచ్చివుంటే వీళ్ళల్లో ఈ ఆందోళన వుండేదికాదు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందులోనూ ప్రజా వ్యతిరేకత బాగా పెరిగిపోయిన నేపధ్యంలో హటాత్తుగా నంద్యాల ఉపఎన్నిక అనివార్యమవటంతోనే సమస్య మొదలైంది.

నంద్యాల ఫలితం ప్రభుత్వంపై పెరిగిపోతున్న  ప్రజా వ్యతిరేకతకు ఉదాహరణగా చెప్పుకునే అవకాశం ఉంది. అందులోనూ మొదటి ప్రభావం ఫిరాయింపుల నియోజకవర్గాల మీదే అన్న విషయం అందరికీ తెలిసిందే. దాంతో ఫిరాయింపు ఎంఎల్ఏల రాజీనామాల కోసం వైసీపీ శ్రేణులు ఒత్తిడి పెంచటం ఖాయం. ఒకవేళ ఫిరాయింపు నియోజకవర్గాల్లో కూడా ఉపఎన్నికలు జరిగితే ఫలితం ఇదే విధంగా ఉంటుందని వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం మొదలు పెడుతుంది. దాంతో ఫిరాయింపులకు నియోజకవర్గాల్లో సమస్యలు మొదలవుతాయి.

ఎలాగంటే, సాధారణ ఎన్నికలకు ఎంతో దూరం లేదు. మిగిలిన ఫిరాయింపుల మాటెలాగున్నా ముందు ఆళ్లగడ్డ ఎంఎల్ఏ, మంత్రైన భూమా అఖిలప్రియ మెడకు చుట్టుకోవటం మాత్రం ఖాయం. టిడిపి ఓడితే అఖిల రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్ధకమైనా ఆశ్చర్యపోనక్కర్లేదని పార్టీలో ప్రచారం మొదలైంది. ఇక మిగిలిన ఫిరాయింపుల్లో చాలామందికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల దక్కేది అనుమానమే.

 

PREV
click me!

Recommended Stories

RK Roja Comments on Chandrababu Super Six: సూపర్ సిక్స్ – సూపర్ ప్లాప్ | Asianet News Telugu
నగరిలోచంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్ | RK Roja Sensational Comments on Chandrababu | Asianet News Telugu