విజయసాయి రెడ్డికి కుటుంబరావు సవాల్

Published : Apr 29, 2019, 02:02 PM IST
విజయసాయి రెడ్డికి కుటుంబరావు సవాల్

సారాంశం

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి టీడీపీ నేత, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సవాల్ విసిరారు.  సోమవారం మీడియాతో మాట్లాడిన కుటుంబరావు... విజయసాయి పై తీవ్ర విమర్శలు చేశారు. 

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి టీడీపీ నేత, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సవాల్ విసిరారు.  సోమవారం మీడియాతో మాట్లాడిన కుటుంబరావు... విజయసాయి పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర అప్పులు పెరిగాయంటూ విజయసాయిరెడ్డి పిచ్చి కుక్కలా అరుస్తున్నారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

 తనను స్టాక్ బ్రోకర్ అంటున్న విజయసాయిరెడ్డి.. ఆయన దొంగ ఆడిటర్ కాదా? అని నిప్పులు చెరిగారు. విజయసాయిరెడ్డికి దమ్ముంటే ఆర్థిక అంశాలపై తనతో చర్చకు రావాలని సవాల్ చేశారు. బెయిల్‌పై వచ్చి బతుకుతున్న విజయసాయి రెడ్డి ఓ పిచ్చి కుక్క అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. 

కేంద్రాన్ని నిధులు అడిగితే జైలు శిక్ష పడుతుందని జగన్, విజయ సాయిరెడ్డికి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ప్రాధాన్యత లేకుండా ప్రభుత్వం ఖర్చు చేస్తోందనడం సిగ్గుచేటన్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం