కర్నూలు వైసీపీలో వేడెక్కిన రాజకీయం : జడ్పీ ఛైర్మన్ రాజీనామా.. జగన్ ఒత్తిడితోనేనా..?

Siva Kodati |  
Published : Dec 18, 2021, 08:17 PM IST
కర్నూలు వైసీపీలో వేడెక్కిన రాజకీయం : జడ్పీ ఛైర్మన్ రాజీనామా.. జగన్ ఒత్తిడితోనేనా..?

సారాంశం

కర్నూలు జిల్లా (kurnool zp Chairman) పరిషత్‌ ఛైర్మన్‌ మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి (malkireddy subba reddy) రాజీనామాతో అక్కడ రాజకీయాలు వేడెక్కాయి. ఈ మేరకు రాజీనామా లేఖను జిల్లా కలెక్టరు కోటేశ్వరరావుకు అందజేశారు

కర్నూలు జిల్లా (kurnool zp Chairman) పరిషత్‌ ఛైర్మన్‌ మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి (malkireddy subba reddy) రాజీనామాతో అక్కడ రాజకీయాలు వేడెక్కాయి. ఈ మేరకు రాజీనామా లేఖను జిల్లా కలెక్టరు కోటేశ్వరరావుకు అందజేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానని.. అంతే తప్పించి మరేం లేదని సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన రాజీనామాతో కొత్త జడ్పీ ఛైర్మన్‌గా ఎర్రబోతుల పాపిరెడ్డికి అదృష్టం వరించే అవకాశం ఉంది.

ఎర్రబోతుల వెంకటరెడ్డికి (yerrabothula venkata reddy) ఛైర్మన్‌ పదవి ఇస్తానని గతంలోనే సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. అయితే కోవిడ్ కారణంగా వెంకటరెడ్డి మృతిచెందారు. దీంతో ఆయన కుమారుడు పాపిరెడ్డి (papi reddy) ఉప ఎన్నికలో గెలిచారు. ఈ నేపథ్యంలో పాపిరెడ్డి కోసం మల్కిరెడ్డిని పార్టీ హైకమాండ్ రాజీనామా చేయించినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. 

ALso Read:AP politics Roundup 2021: టీడీపీ నేతలపై కేసులు, జైలు బాట పట్టిన కీలక నేతలు

కాగా.. జడ్పీ ఛైర్మన్‌గా వెంకట సుబ్బారెడ్డి ఈ ఏడాది సెప్టెంబరు 25న బాధ్యతలు చేపట్టారు. గత నెలలో జడ్పీ స్థాయీ సంఘ ఎన్నికలు నిర్వహించారు. ఈ నెలలో సర్వసభ్య సమావేశానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ... జడ్పీ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేయాలని వైసీపీకి (ysrcp) చెందిన కొందరు నేతలు ఆయనపై ఒత్తిడి తెచ్చారు. విషయం జగన్‌ (ys jagan mohan reddy) దాకా వెళ్లడంతో.. ముఖ్యమంత్రి సూచనతోనే సుబ్బారెడ్డి పదవి నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్