తిరుమల: ఉదయాస్తమాన సేవ పునరుద్ధరణ .. టికెట్ ధర అక్షరాల కోటిన్నర..!

By Siva KodatiFirst Published Dec 18, 2021, 7:47 PM IST
Highlights

తిరుమల (tirmula) శ్రీవారి ఆలయంలో ఉదయాస్తమాన సేవను (udayasthamana seva) టీటీడీ పునరుద్దరించింది. ఈ మేరకు టికెట్ల ధరను నిర్ణయించింది. సాధారణ రోజుల్లో ఉదయాస్తమాన సేవా టికెట్ కోటి రూపాయలు కాగా శుక్రవారం రోజున మాత్రం 1.5 కోట్లుగా టీటీడీ (ttd) నిర్ణయించింది.

తిరుమల (tirmula) శ్రీవారి ఆలయంలో ఉదయాస్తమాన సేవను (udayasthamana seva) టీటీడీ పునరుద్దరించింది. ఈ మేరకు టికెట్ల ధరను నిర్ణయించింది. సాధారణ రోజుల్లో ఉదయాస్తమాన సేవా టికెట్ కోటి రూపాయలు కాగా శుక్రవారం రోజున మాత్రం 1.5 కోట్లుగా టీటీడీ (ttd) నిర్ణయించింది. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర 531 ఉదయాస్తమాన సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ టికెట్‌ కొనుగోలు చేసిన వారు దాదాపు 25 ఏళ్ల పాటు ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశాన్ని పొందుతారు. ఏడాదికి ఒక్కరోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ఆరుగురు భక్తులు పాల్గొనే సౌలభ్యాన్ని కల్పిస్తారు. ఉదయాస్తమాన సేవా టికెట్ల విక్రయం ద్వారా టీటీడీకి దాదాపు రూ.600 కోట్ల పైగా ఆదాయం వస్తుంది. ఉదయాస్తమాన సేవా టికెట్ల కేటాయింపుతో లభించే మొత్తాన్ని చిన్నపిల్లల ఆస్పత్రి అభివృద్ధికి కేటాయించాలని టీటీడీ పాలకమండలి ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. 
 

click me!