ఏపీ: 24 గంటల్లో 137 మందికి కరోనా.. గోదావరి జిల్లాల్లో పెరుగుతున్న కేసులు

Siva Kodati |  
Published : Dec 18, 2021, 07:14 PM IST
ఏపీ: 24 గంటల్లో 137 మందికి కరోనా.. గోదావరి జిల్లాల్లో పెరుగుతున్న కేసులు

సారాంశం

ఏపీలో కొత్తగా 137 కరోనా కేసులు (corona cases in ap) నమోదవ్వగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 189 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,705 మంది చికిత్స పొందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌‌‌లో కరోనా కేసులు స్వల్పంగా (corona cases in ap) తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 137 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,72,788కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,478కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల విశాఖపట్నంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 189 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,56,605కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 31,855 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,09,60,653కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1705మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 5, చిత్తూరు 28, తూర్పుగోదావరి 16, గుంటూరు 12, కడప 5, కృష్ణ 12, కర్నూలు 2, నెల్లూరు 8, ప్రకాశం 2, శ్రీకాకుళం 10, విశాఖపట్నం 14, విజయనగరం 0, పశ్చిమ గోదావరిలలో 23 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు. 

 

PREV
click me!

Recommended Stories

మహిళా రిజర్వేషన్ బిల్లు పై Pamula Pushpa Srivani Reaction | Women Reservation | Asianet News Telugu
పవన్‌ కళ్యాణ్‌.. 30వేల మంది మహిళలు ఏమయ్యారు? Vidadala Rajini Comments| Asianet News Telugu