YCP Candidate: కర్నూల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇలియాజ్ బాషా!

By Mahesh K  |  First Published Feb 22, 2024, 9:28 PM IST

కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీపై సందిగ్దం వీడింది. కర్నూల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇలియాజ్ బాషా పేరు దాదాపుగా ఖరారైపోయినట్టు తెలిసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌కూ తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం.
 


తాడేపల్లి గూడెం వద్ద వైసీపీ కర్నూల్ పంచాయితి ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తున్నది. కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని వైసీపీ గెలుచుకుంది. ప్రస్తుతం కర్నూల్ అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సారి కర్నూల్ అసెంబ్లీ స్థానంలో అభ్యర్థిని వైసీపీ మారుస్తున్నది. సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌కు కాకుండా.. ఇలియాజ్ బాషాను వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంచుకోవాలనే చర్చ జరిగింది.

Also Read: Power Cut: కరెంట్ కట్ చేస్తే బాధ్యులపై యాక్షన్ తీసుకుంటాం: సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్

Latest Videos

దీంతో తాడేపల్లి గూడెంలో కర్నూల్ ఎమ్మెల్యే అభ్యర్థి విషయమై పంచాయితి జరిగింది. అయితే.. ఎట్టకేలకు ఈ పంచాయితి కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. ఇలియాజ్ భాషాను ఇంచార్జీగా నియమించడంపై హఫీజ్ ఖాన్‌కు సర్దిచెప్పినట్టు సమాచారం. హఫీజ్ ఖాన్‌కు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మరో రెండు మూడు రోజుల్లో కర్నూల్ వైసీపీ అభ్యర్థిగా ఇలియాజ్ బాషాను ప్రకటించనున్నట్టు తెలిసింది.

click me!