ఫోటోలతో బ్లాక్ మెయిల్: ఆలూరులో యువకుడిని చెప్పుతో కొట్టిన యువతి

By narsimha lode  |  First Published May 4, 2022, 4:25 PM IST

కర్నూల్ జిల్లాలోని ఆలూరులో  ఓ యువకుడిని యువతి చెప్పుతో కొట్టింది. తన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి బ్లాక్ మెయిల్ చేసినందుకు గాను ఆమె ఈ దాడికి దిగింది.


కర్నూల్:Kurnool జిల్లాలోని Alurలో ఓ యువకుడిని  ఓ యువతి Foot wearతో కొట్టింది.. Face Book లో పరిచయమైన యువకుడు తనను బ్లాక్ మెయిల్ చేయడంతో  అతడిని చెప్పుతో కొట్టింది.

ఫేస్‌బుక్ లో shahnawaz అనే యువకుడికి  ఏలూరుకి చెందిన యువతి పరిచయమైంది.  ఈ పరిచయంతో యువతి పోటోలు తీసుకొన్నాడు. ఆ తర్వాత ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని యువతి నుండి డబ్బులు లాగినట్టుగా బాధితురాలు ఆరోపిస్తుంది. అంతేకాదు తన నుండి డబ్బులు తీసుకొని కూడా సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేశాడని బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.ఈ విషయమై యువకుడిని నిలదీసింది. అంతేకాదు చెప్పుతో కొట్టింది.

Latest Videos

undefined

ఆలూరుకి చేరుకొన్న యువతి షానవాజ్ ను దూషించింది. చెప్పుతో కొట్టింది. అంతేకాదు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

social media లో పరిచయాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నా కూడా కొందరు  మాత్రం గుడ్డిగా నమ్ముతున్నారు. ఈ కారణంగానే ఈ తరహా ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. సోషల్ మీడియాలో అందమైన అమ్మాయిల ఫోటోలను పెట్టి ఛాటింగ్ పేరుతో యువకులను డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు. ఈ తరహా ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి.  

సోషల్ మీడియాలో ఉన్న సమాచారాన్ని సేకరించి బంధువులు, స్నేహితులను డబ్బులు పంపాలని కూడా రిక్వెస్ట్ లు పంపుతున్నఘటనలు ఇటీవల చోటు చేసుకొంటున్నాయి. కొందరు ఐఎఎస్ లు, ఐపీఎస్ అధికారుల పేరుతో కూడా సోషల్ మీడియాలో డబ్బులు రిక్వెస్ట్ చేస్తున్న ఘటనలు కూడా ఇటీవల కాలంలో జరుగుతున్నాయి.

గత మాసంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కలెక్టర్ సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేసినట్టుగా సైబర్ నేరగాళ్లు పోస్టు చేశారు.ఈ రిక్వెస్ట్ ఆధారంగా ఓ డాక్టర్ డబ్బులు కూడా ఇచ్చాడు.  అయితే చివరికి తాను మోసపోయామని  వైద్యుడు గుర్తించాడు. 

సోషల్ మీడియాలో పరిచయం పెంచుకొని పెళ్లి చేసుకొంటానని నమ్మించి డబ్బులు వసూలు చేసిన ఘటనలు కూడా గతంలో చోటు చేసుకొన్నాయి. విదేశాల్లో ఉన్నామని పెళ్లి చేసుకొనేందుకు ఇండియాకు వస్తామని నమ్మించి డబ్బులు లాగిన కేసులు నమోదయ్యాయి. 

మరో వైపు గిఫ్ట్ లు పంపేందుకు అవసరమైన డబ్బులు పంపాలని కోరుతూ  సోషల్ మీడియాలో డబ్బులు డిమాండ్ చేసిన ఘటనలపై కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ తరహా కేసులు నమోదయ్యాయి.

ఇటీవల హైద్రాబాద్ కు చెందిన ఓ టెక్కీకి ఇటీవల ఒక మహిళ నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఈ ఫ్రెండ్ రిక్వెస్ట్ అంగీకరించాడు. దీంతో ఆ మహిళ అతడికి ఫోన్  చేసింది. ఆ సమయంలో ఆమె నగ్నంగా అతడితో మాట్లాడింది. టెక్కీని కూడా నగ్నంగా మారాలని కోరింది. 

అప్పటి నుంచి న్యూడ్ కాల్స్ కు బానిసైన టెక్కీ నకిలీ ఇన్‌స్టాగ్రాం అకౌంట్స్ ఓపెన్ చేశాడు. మహిళల పేరుతో ఉన్న ఐడీలను   వెతికి వారికి అసభ్యకరమైన సందేశాలు, ఫోటోలు వీడియోలు పంపేవాడు.

ఇదే తరహాలో ఒక మహిళను ఇబ్బందులకు గురిచేయగా ఆ మహిళ రాచకొండ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సాయికృష్ణను అరెస్ట్ చేసి జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించారు.

click me!