హిందూపురంలో తల్లీకుమారుడు ఆత్మహత్యాయత్నం.. ఎమ్మెల్సీ ఇక్బాల్ వేధిస్తున్నారని ఆరోపణ

Published : May 04, 2022, 04:12 PM ISTUpdated : May 04, 2022, 05:06 PM IST
హిందూపురంలో తల్లీకుమారుడు ఆత్మహత్యాయత్నం.. ఎమ్మెల్సీ ఇక్బాల్ వేధిస్తున్నారని ఆరోపణ

సారాంశం

ఆంధ్రప్రదేశ్ శ్రీసత్యసాయి జిల్లాలో తల్లి, కొడుకు ఆత్మహత్య యత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. ఇంటిపట్టా విషయంలో ఎమ్మెల్సీ ఇక్బాల్‌ వేధిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.   

ఆంధ్రప్రదేశ్ శ్రీసత్యసాయి జిల్లాలో తల్లి, కొడుకు ఆత్మహత్య యత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. హిందూపురంలో శంకుతల అనే మహిళ, ఆమె కుమారుడు నవీన్ పురుగుల మందులు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అయితే వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఇంటిపట్టా విషయంలో ఎమ్మెల్సీ ఇక్బాల్‌ వేధిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ, కమిషనర్‌ సైతం వేధిస్తున్నారని వారు చెప్పారు. వారి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించినట్టుగా చెబుతున్నారు.

ఇక, ప్రస్తుతం తల్లీకొడుకులకు ప్రస్తుతం ఆస్పత్రిలో డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. వీరిలో తల్లి శకుంతల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. అనంతపురం జిల్లా రామగిరి మండల పరిధిలోని శేషంపల్లిలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. శేషంపల్లికి చెందిన ప్రత్తిపాటి కవిత.. తన కొడుకు వరుణ్‌ తేజ్, కూతురు సింధుజలతో గ్రామ శివారులోని బావిలోకి పడి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

ఇక, బావిలో నుంచి మృతదేహాలను బయటకుతీసి.. పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పిల్లలతో పాటుగా కవిత ఆత్మహత్య చేసుకోవడానికి కుటుంబ కలహాలు, అత్తింటి వేధింపులే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామమంలో విషాదం చోటుచేసుకుంది. 

PREV
click me!

Recommended Stories

PV Sindhu Visits Tirumala: భర్తతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు | Asianet News Telugu
IMD Cold Wave Alert : ఇక ఊపిరి పీల్చుకొండి.. తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గేది ఎప్పట్నుంచో తెలుసా?