కర్నూల్ జిల్లాలోని పాలకొండ మండలం చిన్నకందూరులో కాలభైరవ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కర్నూల్: కర్నూల్ జిల్లాలోని పాలకొండ మండలం చిన్నకందూరులో కాలభైరవ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కాలభైరవ దిగంబర విగ్రహానికి ఇంట్లోనే పూజలు చేస్తే పిల్లలు పుడుతారనే నమ్మకంతోనే ఓ వ్యక్తి ప్రతిమను ధ్వంసం చేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది.
ఈ నెల 19వ తేదీన కాలభైరవ స్వామి విగ్రహాం ధ్వంసమైంది. ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున ఆందోళనలు సాగాయి.ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తే అసలు విషయం వెలుగు చూసింది.
undefined
గోస్పాడు మండలం వంట వెలగల గ్రామానికి చెందిన సత్తెనపల్లి రాజశేఖర్ ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టుగా పోలీసులు తేల్చారు.పోలీసుల విచారణలో రాజశేఖర్ చెప్పిన విషయాలను విన్న పోలీసులు షాక్ తిన్నారు.
రాజశేఖర్ కు పదేళ్ల క్రితం వివాహమైంది. ఆయనకు పిల్లలు పుట్టలేదు. దీంతో ప్రతి అమావాస్య రోజున కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజలు చేసేవాడు. అయితే ఆలయంలో కాకుండా ఇంట్లో పూజలు చేస్తే పిల్లలు పుడతారని ఆయనకు ఎవరో చెప్పారు.
అమావాస్య రోజున ఇంట్లో పూజటు చేస్తే పిల్లలు పుడతారని చెప్పడంతో అర్ధరాత్రి సమయంలో దేవాలయానికి వెళ్లి కాలభైరవ స్వామి విగ్రహాన్ని తీసుకెళ్లాడు.రాజశేఖర్ ఇంట్లో గుట్టుగా పూజలు చేస్తున్న విషయం స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం అందింది.పోలీసులు రాజశేఖర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయం వెల్లడైంది.