తూర్పుగోదావరిలో కరోనా జోరు: ఏపీలో ఏడు లక్షలకు చేరువలో కేసులు

Published : Sep 28, 2020, 07:28 PM ISTUpdated : Sep 28, 2020, 07:46 PM IST
తూర్పుగోదావరిలో కరోనా జోరు: ఏపీలో ఏడు లక్షలకు చేరువలో కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5,487 కరోనా కేసులు నమోదయ్యాయి. మరణించారు.దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు  6 లక్షల 81 వేల 161 కి  చేరుకొన్నాయి. 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5,487 కరోనా కేసులు నమోదయ్యాయి. మరణించారు.దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు  6 లక్షల 81 వేల 161 కి  చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లో 37 మంది కరోనాతో మరణించారు. ప్రకాశంలో ఏడుగురు, చిత్తూరులో ఆరుగురు, కృష్ణాలో ఐదుగురు, తూర్పుగోదావరి, గుంటూరులలో నలుగురి చొప్పున కరోనాతో మరణించారు. కడప, పశ్చిమగోదావరిలలో ముగ్గురి చొప్పున చనిపోయారు. అనంతపురం, విశాఖపట్టణంలలో ఇద్దరి చొప్పున మృతి చెందారు. నెల్లూరులో ఒక్కరు చనిపోయారు.ఏపీ రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 5745 మంది మరణించారు
 
ఏపీ రాష్ట్రంలో గత 24 గంటల్లో 66 వేల 121 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఏపీలో ఇప్పటివరకు 6 లక్షల 12 వేల 300 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 63,116 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.


గత 24 గంటల్లో అనంతపురంలో 310,చిత్తూరులో 329, తూర్పుగోదావరిలో 1010, గుంటూరులో 538, కడపలో 273, కృష్ణాలో 97, కర్నూల్ లో 113, నెల్లూరులో 489,ప్రకాశంలో 634, శ్రీకాకుళంలో 286, విశాఖపట్టణంలో 145, విజయనగరంలో 362,పశ్చిమగోదావరిలో 903కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -56,519, మరణాలు 479
చిత్తూరు  -60,149మరణాలు 641
తూర్పుగోదావరి -95,200 మరణాలు 515
గుంటూరు  -53,782 మరణాలు 523
కడప  -43,132మరణాలు 371
కృష్ణా  -25,281 మరణాలు 413
కర్నూల్  -55,798 మరణాలు 462
నెల్లూరు -51,488 మరణాలు 443
ప్రకాశం -47,356  మరణాలు 470
శ్రీకాకుళం -38,879 మరణాలు 318
విశాఖపట్టణం  -49,502మరణాలు 424
విజయనగరం  -34,541 మరణాలు 217
పశ్చిమగోదావరి -65,336 మరణాలు 447

 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా.. ఈ జిల్లాల్లో వచ్చే పదిరోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు
Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?