కర్నూల్‌లో కల్తీ మద్యం తయారీ: ఒకరి అరెస్ట్, మరో నలుగురి కోసం గాలింపు

Published : Feb 15, 2022, 09:52 AM IST
కర్నూల్‌లో కల్తీ మద్యం తయారీ: ఒకరి అరెస్ట్, మరో నలుగురి కోసం గాలింపు

సారాంశం

కర్నూల్ జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు.   

కర్నూల్: Kurnool  జిల్లా Kalluru మండలం లక్ష్మీపురంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు.Illicit liquor తయారీలో కీలక పాత్రధారిగా ఉన్న తెలుగు శ్రీనివాసులును అరెస్ట్ చేశామని ఎక్సైజ్ పోలీసులు చెప్పారు. 

కల్తీ మద్యం ముఠాకు సంబంధించిన వివరాలను ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ సహాయ పర్యవేక్షణాధికారి Bharath Naik మీడియాకు వివరించారు. సోమవారం నాడు సాయంత్రం భరత్ నాయక్ ఈ విషయమై మీడియాతో మాట్లాడారు.

తెలుగు శ్రీనివాసులుకు తెలంగాణ రాష్ట్రంలోని Gadwal జిల్లా మానవపాడు మండలం  బొంకూరుకు చెందిన Boya Ramesh, Vadde Ramesh మధ్య స్నేహం ఏర్పడింది. ఏపీలో మద్యం ధరలు ఎక్కవగా ఉన్న సమయంలో Telangana  నుండి రమేష్, పరమేష్ లు కర్నూల్ జిల్లాకు అక్రమంగా మద్యం సరఫరా చేసేవారు. అయితే ఈ క్రమంలోనే పలుమార్లు సెబ్ అధికారులకు రమేష్, పరమేష్ లు పట్టుబడ్డారు. అయితే ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో కూడా మద్యం ధరలు తగ్గాయి.

దీంతో కల్తీ మద్యం తయారు చేయాలని నిందితులు భావించారు.Telugu Srinivasulu ఇందుకు సహకరిస్తానని అంగీకరించడంతో పరమేష్, రమేష్ లు నకీలీ మద్యం తయారీకి పూనుకొన్నారు. లక్ష్మీపురం గ్రామంలో నకిలీ మద్యం తయారు చేయాలని భావించారు. శ్రీనివాసులు ఈ మేరకు రమేష్, పరమేష్ కు కల్తీ మద్యం తయారీకీ అవసరమైన ఏర్పాట్లు చేశారు. లక్ష్మీపురంలో కల్తీ మద్యం తయారీ స్థావరం ఏర్పాటు చేశారు.

కల్తీ మద్యం తయారీకి అవసరమైన స్పిరిట్ , రంగు నీళ్లు, పలు బ్రాండ్లకు చెందిన మద్యం సీసాలు సేకరించి నకిలీ మద్యాన్ని తయారు చేసి విక్రయిస్తున్నారు. కల్తీ మద్యం తయారీకి అవసరమైన స్పిరిట్, రంగులు, సీసాలు, సీసా మూతలను బొంకూరు గ్రామానికి చెందిన లోకేష్ గౌడ్, కలుకుంట్ల నాగరాజ్ గౌడ్ లు సరఫరా చేసేవారు. 

ఆయా మద్యం కంపెనీల సీసాల్లో రంగునీళ్లు కలిపిన స్పిరిట్ ను నింపేవారు. ఈ కల్తీ మద్యం సీసాలను ఆయా గ్రామాల్లోని బెల్ట్ షాపులకు తరలించేవారు.  ఈ నెల 6వ తేదీ నుండి నిందితులు నకిలీ మద్యం తయారీని ప్రారంభించారు. 

అయితే నకిలీ మద్యం తయారీకి సంబందించిన సమాచారం అందుకొన్న వెంటనే Excise ఎన్‌ఫోర్స్ మెంట్ బృందం లక్ష్మీపురంలోని నకిలీ మద్యం స్థావరంపై దాడి చేసింది. 20 లీటర్ల స్పిరిట్, 189 నకిలీ ఇంపిరీయల్ బ్లూ సీసాలు, 238 మద్యం సీసా మూతలను సీజ్ చేశారు. 

తెలుగు శ్రీనివాసులుతో పాటు పరమేష్, వడ్డే రమేష్, లోక్‌ష్ గౌడ్, కలుకుంట్ల నాగరాజు గౌడ్ పై కర్నూల్ సెబ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.  మరో నలుగురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా పోలీసులు చెప్పారు. 

గతంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో నకిలీ మద్యం తయారు చేసే ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు.  అయినా  కూడా ఈ తరహ ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో నకిలీ మద్యం తయారీకి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితులు పోలీసులకు చిక్కుతున్నారు. ఈ తరహా నేరాలను పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ నెలకొంది.

PREV
click me!

Recommended Stories

Perni Nani comments on Chandrababu: చంద్రబాబు, పవన్ పేర్ని నాని సెటైర్లు | Asianet News Telugu
IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే