
కర్నూల్: కర్నూల్ జిల్లా ఆలూరులో అక్రమ పాస్ పుస్తకాల వ్యవహరంలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.ముగ్గురిపై వేటేసింది.
Kurnool జిల్లా ఆలూరు మండలంలో భూమి లేకున్నా కూడా Pattadar pass books జారీ చేశారు.ఎలాంటి భూమి లేకున్నా కూడా ఐదు వేల ఎకరాలకు పాస్ పుస్తకాలు జారీ చేశారు.
Alurur మండలంలోని Molagapalli గ్రామంలో 864 ఎఫ్, 894 డీ సర్వే నెంబర్లు లేవు. అయితే ఈ గ్రామంలో సర్వే నెంబర్లపై పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేశారు.
ఈ ఘటనకు సంబంధించి ఆలూరు తహసీల్దార్ హుస్సేన్ సాబ్, వీఆర్వో సూరి సస్పెండ్ చేశారు. కంప్యూటర్ ఆపరేటర్ ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సెంటు భూమి లేకున్నా కూడా పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయడంపై ఇటీవలనే ఆర్డీఓ విచారణ నిర్వహించారు. ఈ పట్టాదారు పాస్తు పుస్తకాలను బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు తీసుకొన్నారు.
అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తికి పట్టాదారు పాస్ పుస్తకాన్ని జారీ చేశారు. అంతేకాదు ఈ సర్వే నెంబర్లను online లో కూడా నమోదు చేశారు. ఈ పాస్ పుస్తకాన్ని bankలో తనఖా పెట్టి చంద్రశేఖర్ రూ. 20 లక్షలు అప్పుగా తీసుకొన్నాడు.
అయితే గ్రామంలో ఈ సర్వే నెంబర్ లో భూములు లేకున్నా కూడా ఆ నెంబర్లను ఆన్ లైన్ లో కూడా నమోదు చేయడంపై ఉన్నతాధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పొరపాటున తాము ఈ సర్వే నెంబర్లను ఆన్ లైన్‌లో నమోదు చేశామని చెబుతున్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆర్డీఓ విచారణ చేపట్టారు.