
ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌లో ఉన్న మున్సిపాలిటీలకు (ap municipal election result), నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో (nellore corporation election results) అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగించింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ఇలాకాలో కూడా వైసీపీ పావా వేసింది. కుప్పం మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. దీంతో చంద్రబాబును కోటను బద్దలు కొట్టామనే ఆనందంలో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో (kuppam) కూడా తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (peddireddy ramachandra reddy) మీడియాతో మాట్లాడారు. కుప్పంలో చంద్రబాబును ప్రజలు తిరస్కరించారని పెద్దిరెడ్డి అన్నారు. కుప్పంలో లోకేష్ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడాడని.. అటువంటి భాషను వాడలేమని చెప్పారు.
చంద్రబాబు ఎన్ని కుయుక్తులు చేసిన ప్రజలు నమ్మలేదని అన్నారు. చంద్రబాబును పుంగనూరులో (Punganur) తనపై పోటీ చేయాలని ఆహ్వానిస్తున్నట్టుగా పెద్దిరెడ్డి చెప్పారు. ఒకవేళ దొంగ ఓట్లు వేస్తే టీడీపీ నేతలు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. తాము ఎన్నికలను ప్రతిష్టాత్మక తీసుకున్నామో.. ఆ రోజే చంద్రబాబుకు టీడీపీ ఓడిపోతుందని తెలుసని అన్నారు. ఓటమికి సాకులు చెప్పుకోవడానికి చంద్రబాబు ఇష్టమొచ్చిన ఆరోపణలు చేశారని చెప్పారు.
ఈ సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన పెద్దిరెడ్డి.. అంతకు ముందు ఎప్పుడు తాము కుప్పంను ప్రతిష్టాత్మకంగా తీసుకోలేదని.. ఇప్పుడు తీసుకున్నాం కాబట్టి గెలిచామని అన్నారు. ‘కాలేజ్‌లో చంద్రబాబు నాకు సీనియర్‌గా ఉన్నాడు. ఆయనో గ్రూపుకు లీడర్, నేనో గ్రూపుకు లీడర్. నేను యూనానిమస్‌గా యూనివర్సిటీ ప్రెసిండెంట్ అయ్యాను.. అప్పుడు ఆయన పోటీ కూడా పెట్టలేదు. ఎందుకు పెట్టలేదో చంద్రబాబును ఎప్పుడైనా ప్రెస్‌మీట్‌లో అడగండి’అని పెద్దిరెడ్డి అన్నారు.
ఇక, వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక వర్షాలు పడ్డాయి కాబట్టి రోడ్లు దెబ్బతిన్నాయి.. చంద్రబాబు ఉన్నప్పుడు వానలు పడవు కాబట్టి రోడ్లు బాగున్నాయని పెద్దిరెడ్డి కామెంట్స్ చేశారు. యుద్దప్రాతిపాదికన రోడ్ల మరమ్మత్తు పనులు చేస్తామని వెల్లడించారు. ఎన్నికల్లో గెలిచినవాళ్లే నాయకులు అని వ్యాఖ్యానించారు.