Kuppam Election:చంద్రబాబు ఇలాకాలో ఉద్రిక్తత... మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, చిత్తూరు టిడిపి చీఫ్ అరెస్ట్

By Arun Kumar PFirst Published Nov 10, 2021, 9:48 AM IST
Highlights

కుప్పం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. అర్థరాత్రి కుప్పంలోని ఓ హోటల్లో బసచేసిన టిడిపి నాయకులు, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పులివర్తి నానిని పోలీసులు అరెస్ట్ చేసారు. 

చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఇలాకా కుప్పంలో ఎలాగయినా గెలిచితీరాలని అదికార వైఎస్సార్ కాంగ్రెస్ భావిస్తోంది. అయితే టిడిపికి కంచుకోటలాంటి ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టిడిపి పరాభవాన్ని చవిచూసింది. దీంతో ఈసారి ఎలాగయినా తిరిగి విజయం సాధించి సత్తా చాటాలని టిడిపి చూస్తోంది. ఇలా ఇరుపార్టీలు మున్సిపల్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే ఈ ఉద్రిక్తతకు బయటినుండి వచ్చినవారు కారణమని భావించిన పోలీసులు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, చిత్తూరు టిడిపి అధ్యక్షులు పులివర్తి నానిని అరెస్ట్ చేసారు. 

kuppam municipal election నామినేషన్ల సందర్భంగా వివాదం చేలరేగిన విషయం తెలిసిందే. ఈ  క్రమంలోనే amarnat reddy, పులివర్తి నానితో పాటు మొత్తం 19మంది టిడిపి నాయకులపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో TDP నాయకులు కుప్పంలోని ఓ హోటల్లో బసచేసినట్లు సమాచారం అందుకున్న పోలీసులు అర్థరాత్రి అక్కడికి చేరుకున్నారు. అక్కడే మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి,  pulivarthi nani ని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు.  

ఇలా కుప్పంలో అర్థరాత్రివేళ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, మరో సీనియర్ నాయకుడు పులివర్తి నాని లను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. కుప్పంలోని ఓ హోటల్ లో భోజనం చేస్తున్న పార్టీనేతలను ఉన్నపలంగా అరెస్ట్ చేయడం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఫ్యాక్షన్ పోకడలకు అద్దం పడుతోందని nara chandrababu naidu దుయ్యబట్టారు. 

read more  కుప్పం మున్సిపల్ కమిషనరేట్ పై దాడి.. ఎన్‌. అమరనాథ్‌రెడ్డితో సహా 19 మంది టీడీపీ నేతలపై కేసు...

గతంలో ఎన్నడూ లేనివిధంగా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు. తమ పార్టీ నేతలను భయభ్రాంతులకు గురిచేసి కుప్పం నుంచి బలవంతంగా పంపించి ఎన్నికను ఏకపక్షం చేసుకోవాలన్నది జగన్ రెడ్డి ప్లాన్ అని... అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఆటలు సాగబోవని చంద్రబాబు హెచ్చరించారు. 

మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి, పులివర్తి నాని అరెస్ట్ అప్రజాస్వామికమని... అక్రమంగా అరెస్ట్ చేసిన టీడీపీ నేతలను వెంటనే విడుదల చేయాలి చంద్రబాబు డిమాండ్ చేసారు. ప్రజాసామ్యయుతంగా ఎన్నికలు జరిగేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. 

టీడీపీ నేతల అరెస్టుని చంద్రబాబు తప్పుబడుతూ రాష్ట్ర డీజీపీ gputham sawang కు లేఖ రాశారు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, పులివర్తి నానిలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసారని... ఈ అరెస్టులతో టీడీపీ ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అధికార వైసిపికి పోలీసులు సహకరిస్తున్నారని... ఇలా ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించకుండా తప్పుచేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిజిపిని కోరారు చంద్రబాబు. 

read more  కుప్పం మున్సిపల్ ఎన్నిక: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, దారికాచి మరి .. వైసీపీపై బాబు ఆగ్రహం

కుప్పం, నెల్లూరులో ఎన్నికల అధికారుల తీరు దారుణమని.. ఫోర్జరీ సంతకాలతో నామినేషన్‌లలో అక్రమాలు చేసిన అధికారులకు సిగ్గుందా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి (amarnath reddy) చొక్కా చింపి ఈడ్చుకు వెళ్లారని... తప్పు చేసింది కాక మళ్ళీ టీడీపీ నేతలపై కేసులు పెడతారా అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. తనకు దండ వేశాడని పుంగనూరులో రమణా రెడ్డి అనే వ్యక్తి ప్రహరీ గోడను కూల్చి వేశారని... వారిపై పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. 

 కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి తరపున 126, వైసిపి నుండి 89, కాంగ్రెస్ 15, బిజెపి నుండి 5 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముుగిసినా అధికారులు తుది జాబితాను విడుదల చేయడంతో కాస్త ఆలస్యం చేసారు. రాత్రి తొమ్మిది వరకు తుది జాబితా ప్రకటించకపోవడంపై టీడీపీ నేతలు మున్సిపల్ ఆఫీసుకు చేరుకొని ధర్నా చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు, టిడిపి శ్రేణులకు మధ్య తోపులాట జరిగి అమర్నాథ్ రెడ్డి చొక్కా చిరిగిపోయింది. 

click me!