భీమవరంలో విషాదం: కొడుకు మృతిని తట్టుకోలేక తల్లి, అమ్మమ్మ సూసైడ్

By narsimha lodeFirst Published Nov 10, 2021, 9:35 AM IST
Highlights


పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకొంది. కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లి ఇందిరాప్రియ, అమ్మమ్మ రాధాకృష్ణకుమారిలు ఆత్మహత్య చేసుకొన్నారు. కరోనా చికిత్స కోసం అప్పులు చేసిన కార్తీక్ ఈ అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకొన్నాడని పోలీసులు  చెబుతున్నారు. 

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విషాదం చోటు చేసుకొంది. కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లి, అమ్మమ్మ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. భీమవరం టూటౌన్ దిర్సుమర్రువారి వీధిలో వేమలమంద యోగేశ్వర వెంకట కార్తీక్, తన తల్లి ఇందిరాప్రియ, అమ్మమ్మ రాధాకృష్ణకుమారితో కలిసి నివాసం ఉంటున్నాడు.కార్తీక్ కు ఇంకా వివాహం కాలేదు.  కార్తీక్ తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. 

also read:కర్ణాటకలో విషాదం: ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

భీమవరంలో అక్వేరియం వ్యాపారాన్ని కార్తీక్ నిర్వహిస్తున్నాడు. ఈ వ్యాపార పనుల నిమిత్తం కార్తీక్ తరచుగా విజయవాడకు వచ్చేవాడు. ఈ నెల 7వ తేదీన కూడా కార్తీక్ విజయవాడ గవర్నర్ పేట పిన్నెలవారివీధిలోని ఓ లాడ్జీలో దిగాడు. అదే రోజు రాత్రి లాడ్జిలో పనిచేసే సిబ్బంది ద్వారా సిగరెట్లు తెప్పించుకొన్నాడు.,  ఈ నెల 8వ తేదీన కార్తీక్ తన గది తలుపులు తెరవలేదు.  దీంతో లాడ్జిలో పనిచేసే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

ఈ సమాచారం అందుకొన్న పోలీసులు లాడ్జిలో పనిచేసే సిబ్బంది సహాయంతో తలుపులు పగులకొట్టారు. అయితే గదిలో కార్తీక్ ఉరేసుకొని మరణించినట్టుగా పోలీసులు గుర్తించారు. కార్తీక్ గదిలో ఉన్న చిరునామా ఆధారంగా పోలీసులు Bhimavaramలో  ఉన్న కార్తీక్ తల్లికి సమాచారం అందించారు.

ఈ విషయం తెలుసుకొన్న Kartik తల్లి Indira Priya, అమ్మమ్మ Radha Krishna Kumari లో మనోవేదకు గురయ్యారు. ఈ నెల 9వ తేదీన ఇందిరాప్రియ, రాధాకృష్ణకుమారిలు తమ ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరేసుకొని Suicide చేసుకొన్నారు. కొడుకు మరణించిన గంటల వ్యవధిలోనే తల్లి, అమ్మమ్మలు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇందిరాప్రియ, రాధాకృష్ణకుమారిల మృతదేహలను పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. 

అక్వేరియం వ్యాపారంలో కార్తీక్ కు నష్టం వచ్చింది.దీంతో ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ఆయన చెన్నైకి వెళ్లాడు. ఆ సమయంలో ఆయనకు Corona సోకింది. కోవిడ్ చికిత్స కోసం లక్షల రూపాయాలను అప్పు చేశాడు.ఈ అప్పుల బాధ భరించలేక కార్తీక్ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 

కార్తీక్ తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణిస్తే, కార్తీక్ అతని తల్లి,అమ్మమ్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. కార్తీక్ మేనమామకు పోలీసులు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం పూర్తైన తర్వాత కార్తీక్ మృతదేహన్ని పోలీసులు మేనమామకు అప్పగించనున్నారు.

ఒకే కుటుంబంలో  గంటల వ్యవధిలో ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడంతో మృతుల బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇందిరాప్రియ, రాధాకృష్ణకుమారిల మృతదేహలను అంత్యక్రియల కోసం తీసుకెళ్లున్న సమయంలో వారి పెంపుడు కుక్క గట్టిగా అరిచింది.ఈ ఘటన  అక్కడే ఉన్న పలువురిని కంటతడి పెట్టించింది.రోడ్డు ప్రమాదంలో భర్త చనిపోవడంతో పాటు ఆర్ధిక సమస్యలతో కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో బతికి ఏం సాధించాలనే ఉద్దేశ్యంతో ఇందిరాప్రియ,ఆమె తల్లి ఆత్మహత్య చేసుకొన్నారని  మృతుల బంధువులు చెప్పారు.   కార్తీక్ మరణించిన విషయం తెలుసుకొన్న తర్వాత ఇందిరాప్రియ కన్నీరు మున్నీరుగా విలపించిందని స్థానికులు తెలిపారు.

click me!