
తిరుపతి : మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలోకి చొరబడి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి, వారి విధులను నిర్వర్తించకుండా, అధికారులపై దౌర్జన్యం చేసినందుకు గాను మాజీ మంత్రి ఎన్. అమరనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులుతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన మరో 16 మందిపై కుప్పం పోలీసులు మంగళవారం కేసులు నమోదు చేశారు.
కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో 14వ వార్డు నుంచి తెలుగుదేశం అభ్యర్థి withdrawal mysteryపై విపక్షాలు మండిపడ్డాయి. దీనిపై మున్సిపల్ కార్యాలయం వద్ద విపక్షాలు హంగామా సృష్టించాయి. ఈ నేపథ్యంలో కమిషనర్ వీఎస్ చిట్టిబాబు సోమవారం అర్థరాత్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా కుప్పం పోలీసులు 19 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. "N Amaranatha Reddyతో పాటు మరో 18 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చట్టవిరుద్ధంగా వ్యవహరించారు. కమీషనర్ ఛాంబర్‌లోకి నేరపూరితంగా చొరబడ్డారు. కమిషనర్ చొక్కా పట్టుకుని, అతనిని, ఇతర సిబ్బందిని వారి న్యాయబద్ధమైన విధులను నిర్వర్తించకుండా బలవంతంగా లాగి, నిరోధించారు. కుప్పం మున్సిపాలిటీలోని 14వ వార్డును ఏకగ్రీవంగా ప్రకటించడంతో కమిషనర్ ఛాంబర్‌లోని డోర్ మిర్రర్‌ను ధ్వంసం చేశారు” అని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
కుప్పం మున్సిపల్ ఎన్నిక: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, దారికాచి మరి .. వైసీపీపై బాబు ఆగ్రహం
మంగళవారం పలమనేరు డీఎస్పీ సీఎం గంగయ్య మీడియాతో మాట్లాడుతూ.. సోమవారం రాత్రి జరిగిన వరుస ఘటనలు దురదృష్టకరమని, ఇందులో రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులు మున్సిపల్ కమిషనర్‌పై అసభ్యంగా ప్రవర్తించి, గది అద్దాలు పగలగొట్టారని అన్నారు. బయటి వ్యక్తులు తక్షణమే ఊరు వదిలి వెళ్లాలని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని కోరారు.
పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నవంబర్ 15న Kuppam municipality electionsకు సంబంధించి సోమవారం రాత్రి ఎన్నికల నామినేషన్ అధికారి withdrawals list ను డిస్ ప్లే చేశారు. దీంట్లో 14వ వార్డులో తమ అభ్యర్థి పేరు విత్ డ్రా లిస్టులో ఉండడం.. వైఎస్సార్‌సీ అభ్యర్థి ఏకగ్రీవంగా గెలుపొందడాన్ని గుర్తించిన టీడీపీ కార్యకర్తలు, తమ అభ్యర్థి పట్టణంలో లేరని, ఆయన నామినేషన్‌ను ఎలా ఉపసంహరించుకుంటారని వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
అనంతలో విద్యార్ధులపై లాఠీచార్జీ: మంత్రి సురేష్‌ను ఘోరావ్ చేసిన విద్యార్ధి సంఘాలు, ఉద్రిక్తత
14వ వార్డు నుంచి డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి ప్రకాష్, ఆయన సతీమణి తిరుమగల్‌ల వీడియోను చూపిస్తూ.. తమ అభ్యర్థి కుప్పంకు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నారని, తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకునే అవకాశం లేదని టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. అయితే, మున్సిపల్ కార్యాలయం నుండి సీనియర్ నాయకులతో సహా టిడిపి కార్యకర్తలను పోలీసులు బయటకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఆ సమయంలో అమరనాథ రెడ్డి చొక్కా చిరిగిపోయింది. దీంతో అక్కడ పరిస్థితి తీవ్రంగా మారింది.