వైసీపీ పై విమర్శలు.. రఘురామ తీరుపై మండిపడ్డ క్షత్రియ నేతలు

Published : May 17, 2021, 09:06 AM IST
వైసీపీ పై విమర్శలు.. రఘురామ తీరుపై మండిపడ్డ క్షత్రియ నేతలు

సారాంశం

రఘురామకృష్ణరాజుకు క్షత్రియ సేవాసమితి ఎలాంటి మద్దతు ఇవ్వట్లేదని స్పష్టం చేశారు. ఇది కేవలం ప్రభుత్వానికి, రఘురామకృష్ణరాజుకు సంబంధించిన వ్యవహారమని పేర్కొన్నారు.

ఎంపీ రఘురామ కృష్ణం రాజు పై క్షత్రియ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ గుర్తుపై గెలిచి... ఆ పార్టీపైనే విమర్శలు చేయడం కరెక్ట్ కాదని వారు పేర్కొన్నారు. భీమవరంలో క్షత్రియ సమాఖ్య ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలో భీమవరం, పాలకొల్లు, గణపవరం, తణుకు, తాడేపల్లి గూడెం క్షత్రియ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా క్షత్రియ నాయకులు మీడియాతో మాట్లాడుతూ, క్షత్రియులపై గౌరవంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. నర్సాపురం ఎంపీ నియోజకవర్గంలో‌ 3 ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీటు ఇచ్చి గౌరవించారన్నారు. రఘురామకృష్ణరాజుకు క్షత్రియ సేవాసమితి ఎలాంటి మద్దతు ఇవ్వట్లేదని స్పష్టం చేశారు. ఇది కేవలం ప్రభుత్వానికి, రఘురామకృష్ణరాజుకు సంబంధించిన వ్యవహారమని పేర్కొన్నారు. ఇందులో క్షత్రియ కులాన్ని కలపొద్దని.. తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

రఘురామకృష్ణరాజుకు స్థానిక ఎమ్మెల్యేలతో సఖ్యత లేదని.. స్వలాభం, ఆస్తులు కాపాడుకోవడానికే ఆయన మాట్లాడుతున్నారని క్షత్రియ నాయకులు దుయ్యబట్టారు. రఘురామ మాట్లాడే విధానం, పద్ధతి అపహస్యంగా ఉందని మండిపడ్డారు. ‘‘గడిచిన 14 నెలలుగా ఒక్కసారి కూడా సొంత నియోజకవర్గానికి రాలేదు. హైదరాబాద్‌, ఢిల్లీలో మకాం పెట్టి రోజుకో కులాన్ని దూషిస్తున్నాడు. ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేసే ఎవ్వరికీ సపోర్ట్‌ చేయమని’’ క్షత్రియ నాయకులు స్పష్టం చేశారు.

PREV
click me!

Recommended Stories

Kondapalli Srinivas: చెప్పిన టైం కంటే ముందే పూర్తి చేశాం మంత్రి కొండపల్లి శ్రీనివాస్| Asianet Telugu
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్ పోర్ట్ లో రామ్మోహన్ నాయుడు స్పీచ్| Asianet Telugu