రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ ప్రాజెక్టు: నేడు పనుల పరిశీలనకు కేఆర్ఎంబీ టీమ్

Published : Aug 11, 2021, 09:51 AM IST
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ ప్రాజెక్టు: నేడు పనుల పరిశీలనకు కేఆర్ఎంబీ టీమ్

సారాంశం

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను కేఆర్ఎంబీ అధికారులు బుధవారం నాడు పరిశీలించనున్నారు. ఎన్జీటీ ఆధేశాల మేరకు కేఆర్ఎంబీ అధికారులు పరిశీలించనున్నారు.  


హైదరాబాద్:రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను కేఆర్ఎంబీ అధికారుల బృందం బుధవారం నాడు పరిశీలించనున్నారు. కొంతకాలంగా ఈ ప్రాజెక్టు పనుల పరిశీలన కార్యక్రమం చాలా కాలంగా వాయిదా పడుతుంది. ఇవాళ ప్రాజెక్టుల పనులను పరిశీలిస్తామని ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ లేఖ రాసింది.

ఈ ప్రాజెక్టు పనుల పరిశీలన కోసం నోడల్ అధికారిని నియమించాలని ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ లేఖ రాసింది.అయితే ఈ విషయమై ఏపీ ప్రభుత్వం నుండి కేఆర్ఎంబీకి ఎలాంటి సమాచారం రాలేదు. కేఆర్ఎంబీ అధికారులతో కర్నూల్ నీటిపారుదల శాఖ సీఈ  ప్రాజెక్టు వద్దకు వెళ్లనున్నారు.

తెలంగాణ ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంధ సంస్థ కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్ పై ఈ ప్రాజెక్టు పనులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని  నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్  కేఆర్ఎంబీని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు కేఆర్ఎంబీ బృందం ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తీవ్రవాయుగుండం తీరం దాటేది ఇక్కడే.. ఈ రెండ్రోజులూ మూడు తెలుగు జిల్లాల్లో వర్షాలే వర్షాలు
Bhumana Karunakar Reddy: కూటమి పాలనలో దిగ‌జారుతున్న తిరుమ‌ల ప్ర‌తిష్ట | TTD | Asianet News Telugu