బీజేపీతో పవన్ పొత్తు.. తొలిసారి స్పందించిన కృష్ణం రాజు

Published : Jan 18, 2020, 04:01 PM IST
బీజేపీతో పవన్ పొత్తు..  తొలిసారి స్పందించిన కృష్ణం రాజు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే పవన్ కళ్యాణ్ తో బీజేపీ కలిసిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ రెండు పార్టీలు జతకట్టడం ఎంతో శుభపరిణామమని అభిప్రాయపడ్డాడు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్... కేంద్రంలోని అధికార పార్టీ అయిన బీజేపీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా... ఈ పొత్తుపై తాజాగా... కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత, సినీ నటుడు కృష్ణం రాజు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే పవన్ కళ్యాణ్ తో బీజేపీ కలిసిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ రెండు పార్టీలు జతకట్టడం ఎంతో శుభపరిణామమని అభిప్రాయపడ్డాడు.

Also Read బిజెపితో జనసేన పొత్తు... టిడిపి పరిస్థితి ఏంటంటే: మాజీ మంత్రి గంటా వ్యాఖ్యలు...

హైదరాబాద్ ఫిల్మ్ నగర్ క్లబ్ లో జరిగిన తన 80 పుట్టిన రోజు వేడుకల్లో కృష్ణం రాజు ఈ విషయాన్ని ప్రస్తావించారు. సిద్ధాంతాలు కలుపుకొని 5కోట్ల మంది ఆంధ్రులకు సేవ చేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ విస్తరణకు బీజేపీ కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ తోడవడం అన్ని రకాల మేలు చూకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

టీనేజీ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి..? ఏపీలో అత్యధికం, అత్యల్పం ఎక్కడ, ఎంతో తెలుసా..?
ఆంధ్ర ప్రదేశ్ లో ఏఐ యూనివర్సిటీ.. ఇక్కడ చదివితే లక్షల జీతంతో జాబ్ పక్కా..!