సిఎం జగన్ ఓఎస్డీగా కృష్ణ మోహన్ రెడ్డి

By telugu teamFirst Published May 30, 2019, 8:41 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా కృష్ణమోహన్‌ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు జీఏడీ కార్యదర్శి శ్రీకాంత్‌ గురువారం జీవో జారీ చేశారు. కృష్ణమోహన్‌ రెడ్డి స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌గా రిటైర్డ్‌ అయ్యారు. 

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా కృష్ణమోహన్‌ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు జీఏడీ కార్యదర్శి శ్రీకాంత్‌ గురువారం జీవో జారీ చేశారు. కృష్ణమోహన్‌ రెడ్డి స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌గా రిటైర్డ్‌ అయ్యారు. 

కాగా, వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిగా అపాయింట్‌ చేస్తూ గవర్నర్‌ నరసింహన్‌ నోటీఫికేషన్‌ జారీ చేశారు. గవర్నర్‌ నోటిఫికేషన్‌ ఆధారంగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ అద‌న‌పు కార్య‌ద‌ర్శిగా కే. ధ‌నుంజ‌య‌రెడ్డిని నియ‌మించారు. ప్రస్తుతం ఏపీ టూరిజం కార్పొరేషన్ ఎండీగా ఉన్న ఆయన ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు. 

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ధనుంజయ్ రెడ్డి గతంలో వ్యవసాయశాఖలో పనిచేశారు. శ్రీకాకుళం కలెక్టర్‌గానూ బాధ్యతలు నిర్వహించారు.

click me!