బీజేపీలో చేరిన కోట్ల హరిచక్రపాణిరెడ్డి

Published : Aug 27, 2018, 01:42 PM ISTUpdated : Sep 09, 2018, 11:04 AM IST
బీజేపీలో చేరిన కోట్ల హరిచక్రపాణిరెడ్డి

సారాంశం

 కోట్ల హరిచక్రపాణిరెడ్డి  సోమవారం నాడు  బీజేపీలో చేరారు. తన అనుచరులతో కలిసి హరిచక్రపాణిరెడ్డి  బీజేపీ తీర్థం పుచ్చుకొన్నారు.  

అమరావతి: కోట్ల హరిచక్రపాణిరెడ్డి  సోమవారం నాడు  బీజేపీలో చేరారు. తన అనుచరులతో కలిసి హరిచక్రపాణిరెడ్డి  బీజేపీ తీర్థం పుచ్చుకొన్నారు.

సోమవారం నాడు హైద్రాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో  జరిగిన కార్యక్రమంలో  కోట్ల హరిచక్రపాణిరెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకొన్నారు. ఈ సందర్భంగా  వచ్చే ఎన్నికల్లో  దేశంలో బీజేపీని  ఓడించేందుకుగాను భావసారూప్యత లేని పార్టీలన్నీ ఏకమయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయని  మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరీ చెప్పారు. 

పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది బీజేపీయేనని ఆమె గుర్తు చేశారు. నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన నిధుల విషయమై  ప్రజల్లో విస్తృతంగా  ప్రచారం చేయాలని ఆమె కోరారు. బీజేపీని బలోపేతం చేయడంలో  కోట్ల హరిచక్రపాణిరెడ్డితో పాటు ఆయన అనుచరులు బీజేపీలో చేరడాన్ని ఆమె స్వాగతించారు. 

ఇతర పార్టీల నుండి బీజేపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న పలువురు నేతలను  చేర్చుకొనేందుకు బీజేపీ నేతలు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు.  ఈ మేరకు  ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో  బలమైన నేతలను తమ పార్టీలో చేర్చుకొనేందుకు  బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే  కోట్ల హరిచక్రపాణిరెడ్డిని బీజేపీలో చేర్చుకొన్నారు. 


 

PREV
click me!

Recommended Stories

Rain Alert: వాయుగుండంగా మారిన అల్పపీడ‌నం.. ఈ ప్రాంతాల్లో వ‌ర్షాలే వ‌ర్షాలు
YS Jagan Pressmeet: చంద్రబాబు, పవన్ పై జగన్ సంచలన కామెంట్స్ | Asianet News Telugu