అనిల్ యాదవ్ అనుచరుడిపై కోటంరెడ్డి వర్గీయుల దాడి.. నెల్లూరులో ఉద్రిక్తత

Siva Kodati |  
Published : Feb 14, 2023, 07:30 PM ISTUpdated : Feb 14, 2023, 07:31 PM IST
అనిల్ యాదవ్ అనుచరుడిపై కోటంరెడ్డి వర్గీయుల దాడి.. నెల్లూరులో ఉద్రిక్తత

సారాంశం

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో అనిల్ వర్గానికి చెందిన సమీర్ అనే వ్యక్తి కత్తిపోట్లకు గురయ్యాడు. 

నెల్లూరు వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బారాషాహీ దర్గా వద్ద రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి.  అనిల్ వర్గానికి చెందిన సమీర్‌ను కత్తితో పోడిచారు కోటంరెడ్డి వర్గీయులు. దీంతో వెంటనే సమీర్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

సచివాలయం ఉద్యోగులు VS పోలీస్ లు విజయవాడ ధర్నా చౌక్ వద్ద హై టెన్షన్ | Secretariat Employees Dharna
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు