కొనసీమ జిల్లా పేరు మార్పు.. ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేయనున్న ప్రభుత్వం..

Published : May 18, 2022, 03:57 PM IST
కొనసీమ జిల్లా పేరు మార్పు.. ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేయనున్న ప్రభుత్వం..

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో నెల రోజుల క్రితం కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిన సంగతి తెలిసిందే. పాత 13 జిల్లాల స్థానంలో.. 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. అందులో కొనసీమ జిల్లా కూడా ఒకటి. అమలాపురం జిల్లా కేంద్రంగా కొనసీమ జిల్లాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో నెల రోజుల క్రితం కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిన సంగతి తెలిసిందే. పాత 13 జిల్లాల స్థానంలో.. 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. అందులో కొనసీమ జిల్లా కూడా ఒకటి. అమలాపురం జిల్లా కేంద్రంగా కొనసీమ జిల్లాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే తాజాగా కొనసీమ జిల్లా పేరు మారనుంది. కొనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కొనసీమ జిల్లాగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభత్వం త్వరలోనే ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేయనుంది. 

ఇక, అమలాపురం కేంద్రంగా ఏర్పడిన కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టాలనే డిమాండ్ ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ వెలువడినప్పటీ నుంచి వినిపిస్తుంది. ఇందుకోసం అంబేడ్కర్‌ జిల్లా సాధన సమితి నేతృత్వంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం తాజాగా కొనసీమ జిల్లా పేరును.. డాక్టర్ అంబేడ్కర్ కొనసీమ జిల్లాగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. 

కొనసీమ జిల్లా విషయానికి వస్తే ఇందులో.. రామచంద్రాపురం, మండపేట, అమలాపురం, రాజోలు, గన్నవరం, కొత్తపేట, ముమ్మిడివరం అసెంబ్లీ నియోజవర్గాలు ఉన్నాయి. జిల్లాలో రామచంద్రాపురం, అమలాపురం రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. రామచంద్రాపురం, కె గంగవరం, మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం, కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు మండలాలతో కొనసీమ జిల్లా ఏర్పాటు చేశారు. జిల్లా విస్తీర్ణం.. 2,083 చదరపు కిలోమీటర్లు కాగా, జనాభా.. 17.191 లక్షలు. 

ఇక, ఇటీవల ఏలూరు జిల్లాలో వైఎస్సార్ రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. గణపవరంను భీమవరం జిల్లాలో కలుపుతామని చెప్పారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో అదనంగా మరో జిల్లా వచ్చే అవకాశం ఉందని కొత్త జిల్లాలు ఏర్పాటైన కొద్ది రోజులకే అప్పటి మంత్రి పేర్ని నాని సంకేతాలు ఇచ్చారు. రంపచోడవరం, పొలవరం ముంపు గ్రామాలతో కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan with “Tiger of Martial Arts” Title: టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు| Asianet Telugu
Raghurama krishnam raju: ఘట్టమనేని ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే RRR స్పీచ్| Asianet News Telugu