Kommineni Srinivasa Rao: అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్

Published : Jun 09, 2025, 11:24 AM IST
Kommineni Srinivasa Rao

సారాంశం

Kommineni Srinivasa Rao: అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.

Kommineni Srinivasa Arrest: అమరావతి మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు సోమవారం హైదరాబాద్‌లో జర్నలిస్టు కాలనీలో ఉన్న ఆయన నివాసానికి వెళ్లి అరెస్టు చేశారు.

ఈ అరెస్టు గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా జరిగింది. ఇటీవల అమరావతి ప్రాంతానికి చెందిన మహిళలు, ఏపీ రాజధాని ఉద్యమంలో పాల్గొంటున్న రైతులు కలిసి చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు.

ఫిర్యాదులో, కొమ్మినేని శ్రీనివాసరావు అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు స్థానిక ప్రజలను అవమానపరిచే విధంగా ఉన్నాయని, మహిళల గౌరవాన్ని హరించేవిగా ఉన్నాయని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు.

తుళ్లూరు పోలీస్ స్టేషన్‌ అధికారులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం, శ్రీనివాసరావు హైదరాబాద్‌లో ఉన్నారని తెలుసుకుని సోమవారం ఉదయం ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టు అనంతరం ఆయనను విచారించేందుకు తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. ఈ కేసు క్రిమినల్ డిఫమేషన్, మహిళల గౌరవాన్ని దెబ్బతీసే నేరాలకు సంబంధించిన నిబంధనల కింద నమోదు చేసినట్లు సమాచారం.

కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఈ అరెస్టుపై రాజకీయ, మీడియా వర్గాల్లో వివిధ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు దీనిపై పూర్తి విచారణ చేపట్టినట్లు సమాచారం. అంతకుముందు, ఏపీ డిప్యూటీ సీఎం ఇదే విషయంలో వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

లోకేష్ పంచ్ లకి పడి పడి నవ్విన టీచర్స్ Nara Lokesh Meets Teachers Returned from Singapore Study Tour
ఇలా చేస్తే ఒక్క క్లిక్ తో ఏ సబ్జెక్టువీక్ ఉన్నాడో ఈజీగా తెలిసిపోతుంది | Nara Lokesh Meets Teachers