బందిపోటు జగన్... ఈ ప్రశ్నలకు సమాధానమేది?: పట్టాభిరాం నిలదీత

By Arun Kumar PFirst Published Mar 12, 2021, 5:00 PM IST
Highlights

తన బందిపోటు ముఠాలోని కీలకసభ్యుడైన విజయసాయిరెడ్డి వియ్యంకుడి కంపెనీ అరబిందో రియాలిటీ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్  ద్వారా సీఎం జగన్ పోర్టుల కబ్జాకు తెరలేపాడని ఆరోపించారు. 

గుంటూరు: ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బందిపోటులా మారిపోయాడని టీడీపీ  జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. తన బందిపోటు ముఠాలోని కీలకసభ్యుడైన విజయసాయిరెడ్డి వియ్యంకుడి కంపెనీ అరబిందో రియాలిటీ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్  ద్వారా పోర్టుల కబ్జాకు తెరలేపాడని ఆరోపించారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి సంపద పెంచితే నేడు జగన్ రెడ్డి ఆ సంపదను దోచుకొని తన వ్యక్తిగత సంపద పెంచుకుంటన్నాడని పట్టాభిరాం అన్నారు. 

''కాకినాడ గేట్ వే పోర్ట్ లిమిటెడ్, కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ తో పాటు రామాయపట్నం పోర్టుని కూడా అరబిందో రియాలిటీ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకే బందిపోటు ముఖ్యమంత్రి దోచిపెట్టాడు. ఒకే కంపెనీకి ఒకదాని తర్వాత ఒకటి రాష్ట్రంలోని పోర్టులన్నీ ఎలా దక్కుతాయో బందిపోటు ముఖ్యమంత్రి  సమాధానం చెప్పాలి. కాకినాడ గేట్ వేపోర్టు లిమిటెడ్ లోని 99శాతం షేర్ల బదిలీ ప్రక్రియ నవంబర్ 2020లోనే జరిగితే, కాకినాడ సీపోర్ట్ కి చెందిన 41.12శాతం షేర్లను అరబిందో కంపెనీకి బదలాయిస్తూ డిసెంబర్ 24న జీవో ఎలా ఇచ్చారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి'' అని ప్రశ్నించారు.

read more  మా ప్రభుత్వంలో... ఆ పోలీసులు మూల్యం చెల్లించుకోక తప్పదు: అచ్చెన్న హెచ్చరిక

''75 కిలోమీటర్ల పరిధిలోపలున్న రెండు పోర్టుల్లోని షేర్లను ఒకే కంపెనీకి బదలాయిస్తూ బందిపోటు ముఖ్యమంత్రి జీవో ఎలా ఇచ్చాడో సమాధానం చెప్పాలి. ఇది  తన దోపిడీకోసం ముఖ్యమంత్రి నడిపిన వ్యవహారం కాదా? పోర్టులను తన గుప్పెట్లో పెట్టుకొని రాష్ట్రంలోని సంపదనంతా దోచేసి, విదేశాలకు తరలించాలన్నదే జగన్ దుర్మార్గపు ఆలోచన'' అని పట్టాభి ఆరోపించారు. 


 

click me!