ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి.. శుభాకాంక్షల తెలిపిన సీఎం జగన్

Published : Sep 19, 2022, 12:33 PM IST
ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి.. శుభాకాంక్షల తెలిపిన సీఎం జగన్

సారాంశం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాం సోమవారం శాసనసభలో ప్రకటన చేశారు. 

ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాం సోమవారం శాసనసభలో ప్రకటన చేశారు. డిప్యూటీ స్పీకర్ పదవికి కోలగట్ల వీరభద్రస్వామి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో.. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా ప్రకటించారు. కోలగట్ల వీరభద్రస్వామికి హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు. అనంతరం సీఎం జగన్.. కోలగట్లను వీరభద్ర స్వామిని ఆత్మీయ అలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.   

ఇక, సభా సంప్రదాయం ప్రకారం సీఎం జగన్, మంత్రులు, టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత అచ్చెన్నాయుడు.. కోలగట్ల వీరభద్రస్వామిని స్పీకర్ చైర్ వద్దకు తీసుకెళ్లారు. అనంతరం ఆయనకు సభ్యులు శుభకాంక్షలు తెలియజేశారు. ఇటీవల డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రఘుపతి రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. ఇక, శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు శుక్రవారం నోటిఫికేషన్ వెలువడింది. వైసీపీ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. కోలగట్ల వీరభద్రస్వామి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్