ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో మా కుటుంబానికి సంబంధం లేదు.. వైసీపీ ఎంపీ మాగుంట

Published : Sep 19, 2022, 11:40 AM IST
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో మా కుటుంబానికి సంబంధం లేదు.. వైసీపీ ఎంపీ మాగుంట

సారాంశం

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో తమ కుటుంబానికి ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేదన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో తమ కుటుంబానికి ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేదన్నారు. తమ తండ్రి హయాం నుంచే తాము లిక్కర్ వ్యాపారం చేస్తున్నామని చెప్పారు. కుట్రపూరితంగా తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను, తన కుమారుడు ఢిల్లీ లిక్కర్ బిజినెస్‌లో డైరెక్టర్లుగా లేమని చెప్పారు. వ్యాపారం చేసే తమ బంధువులకు మాగుంట అనే పేరు ఉండటం వల్లే తమపై ఆరోపణలు అని చెప్పారు. ఢిల్లీలో 32 జోన్లు ఉంటే తమ బంధువులు 2 జోన్లలో వ్యాపారం చేశారని తెలిపారు. తమ ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేసిన ఈడీకి అనుమానాలు నివృత్తి చేసినట్టుగా చెప్పారు. 

ప్రజా సేవ కోసమే రాజకీయాల్లో వచ్చినట్టుగా స్పష్టం చేశారు. తాను ఏ వ్యాపారాల్లోనూ భాగస్వామిని కాదని చెప్పారు. తన వ్యక్తిత్వంపై కావాలని దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై సీబీఐ కూడా విచారణ జరుపుతోందన్నారు. దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేస్తున్నాయని అన్నారు. లిక్కర్ డాన్, లిక్కర్ మాఫియా అని ఢిల్లీలో మీడియాలో రకరకాల పేర్లు పెట్టారని అన్నారు. తమ బంధువులు చేసే వ్యాపారాలు తమకు నష్టం కలిగించాయని చెప్పారు. అయినప్పటికీ తమ రాజకీయ జీవితానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. 2024లో ఒంగోలు ఎంపీగా తన కొడుకు రాఘవరెడ్డి పోటీ చేస్తారని చెప్పారు. 


ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. శుక్రవారం రోజున ఈడీ అధికారులు దేశవ్యాప్తంగా 40కి పైగా చోట్ల దాడులు నిర్వహించారు. అయితే.. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిన ప్రాంగణాల్లో ఈడీ సోదాలు నిర్వహించింద. నెల్లూరులోని మాగుంట కార్యాలయం, బంధువుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్