గుంటూరు జిల్లా నరసరావుపేట వైసీపీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. బుధవారం నరసరావుపేట లింగంగుంట్లలో 200 పడకల ఆసుపత్రిని మంత్రి విడదల రజిని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కూడా హాజరయ్యరు.
గుంటూరు జిల్లా నరసరావుపేట వైసీపీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మంత్రి విడదల రజని ప్రాతినిథ్యం వహిస్తున్న చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గం నరసరావుపేట పార్లమెంట్ స్థానం పరిధిలో ఉంది. అయితే విడదల రజిని, శ్రీకృష్ణదేవరాయలు వర్గాల మధ్య అధిపత్య పోరు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అవి మరోసారి బహిర్గతం అయ్యాయి. బుధవారం నరసరావుపేట లింగంగుంట్లలో 200 పడకల ఆసుపత్రిని మంత్రి విడదల రజిని ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కూడా హాజరయ్యరు. ఒకే వేదికపై పక్కపక్కనే ఉన్న ఇరువురు పలకరించుకోలేదు. మంత్రి విడదల రజినిని పలకరించకుండా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మొహం తిప్పుకున్నారు. మరోవైపు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రాగానే.. మంత్రి విడదల రజిని కార్యక్రమం పూర్తి చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో నరసరావుపేట వైసీపీ వర్గాల్లో ప్రస్తుతం ఈ అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.