దుర్గగుడిలో మహిళలపై లైంగిక వేధింపులు: కోడెల సూర్యలత సంచలనం

By narsimha lodeFirst Published Aug 18, 2018, 1:45 PM IST
Highlights

దుర్గగుడి  పాలకవర్గ సభ్యులపై  మాజీ పాలకవర్గ సభ్యురాలు  కోడెల సూర్యలత సంచలన ఆరోపణలు చేశారు.  అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరె మాయమైన విషయంలో ఆరోపణలు రావడంతో సూర్యలతను పాలకవర్గం నుండి తప్పించారు.


విజయవాడ:  దుర్గగుడి  పాలకవర్గ సభ్యులపై  మాజీ పాలకవర్గ సభ్యురాలు  కోడెల సూర్యలత సంచలన ఆరోపణలు చేశారు.  అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరె మాయమైన విషయంలో ఆరోపణలు రావడంతో సూర్యలతను పాలకవర్గం నుండి తప్పించారు. అయితే తాజాగా  కోడెల సూర్యలత చేసిన  సంచలన ఆరోపణలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

విజయవాడ దుర్గగుడి పాలకవర్గసభ్యుడొకరు దేవాలయంలో  పనిచేసే  మహిళలపై లైంగిక వేధింపులు చోటు చేసుకొంటున్నాయని ఆమె ఆరోపించారు. ఇప్పటికే సుమారు ఐదుగురు మహిళలు వేధింపులను ఎదుర్కొంటున్నట్టుగా దుర్గగుడి ఛైర్మెన్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేసినట్టు ఆమె గుర్తు చేశారు.

అయితే ఈ విషయమై  దుర్గగుడి ఛైర్మెన్ గౌరంగబాబు ఈ ఫిర్యాదులను తొక్కిపెట్టారని కోడెల సూర్యలత ఆరోపించారు.  ఈ ఫిర్యాదుల గురించి తాను  ఛైర్మెన్‌ను నిలదీసినట్టు చెప్పారు.  అయితే  ఈ విషయాన్ని తాను ప్రశ్నించినందుకుగాను తనపై చీరెల దొంగతనాన్ని నెట్టారని  ఆమె ఆరోపించారు.

దేవాలయంలో  అన్నదానం, చీరెల, కేశఖండన తదితర విభాగాల్లో  విజిలెన్స్ విచారణ నిర్వహించినా  లైంగిక వేధింపుల ఘటనపై  ఎందుకు విచారణ చేయడం లేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. 

ఈ విషయమై  తాను ప్రశ్నించడంతో అమ్మవారికి సమర్పించిన చీరెను దొంగిలించినట్టు ఆరోపణలు చేశారని ఆమె ఆరోపించారు.  తాను చేసిన ఆరోపణలపై  విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.

click me!