శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద, నాలుగు గేట్లెత్తి నీటి విడుదల (వీడియో)

By Arun Kumar PFirst Published Aug 18, 2018, 12:10 PM IST
Highlights

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. ఈ వరద నీటితో జలాశయం నిండు కుండను తలపిస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 880 అడుగులకు చేరింది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు నాలుగు గేట్లెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో  3,36,503 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి ఇన్‌ఫ్లోగా వస్తుండగా, 1,03,792 క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతోంది.   

శ్రీశైలం జలాశయ సామర్థ్యం  215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుత నిల్వ 180.28 టీఎంసీలకు చేరింది. ఈ వరద ఇలాగే కొనసాగితే మరికొద్ది గంటల్లో ప్రాజెక్టు నీటి మట్టం పూర్తి స్థాయికి చేరే అవకాశం ఉందని అధికారుల తెలిపారు. ప్రాజెక్టు గేట్లెత్తడంతో దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు అధికారులు తెలిపారు.

వీడియో

"

click me!