జూ. ఎన్టీఆర్ తీరిగ్గా కూర్చుంటే టిడిపి పరిస్థితి అంతే.. కొడాలి నాని!

By Siva KodatiFirst Published May 25, 2019, 7:40 AM IST
Highlights

ఈ నెల 23న వెలువడిన ఏపీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంతో తెలుగు దేశం పార్టీ ఎన్నడూ లేని విధంగా డీలా పడిపోయింది. వైసిపి 175 సీట్లకుగాను 151 సీట్లు కైవసం చేసుకుంది.

ఈ నెల 23న వెలువడిన ఏపీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంతో తెలుగు దేశం పార్టీ ఎన్నడూ లేని విధంగా డీలా పడిపోయింది. వైసిపి 175 సీట్లకుగాను 151 సీట్లు కైవసం చేసుకుంది. ఇక టిడిపి కేవలం 23 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ఇదిలా ఉండగా వైసిపి ఫైర్ బ్రాండ్ లీడర్ కొడాలి నాని మరోమారు గుడివాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

ఇటీవల నాని మీడియాతో మాట్లాడుతూ టిడిపి ఘోర పరాభవంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా నందమూరి కుటుంబసభ్యులు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ సంధర్భంగా జూ. ఎన్టీఆర్ పై నాని చేసిన వ్యాఖ్యలు సరికొత్త రాజకీయ చర్చకు తెరలేపుతున్నాయి. తాను గుడివాడ నుంచి మరోమారు ఎన్నికయ్యానంటే జగన్ కు ఉన్న ప్రజాదరణ కారణం అని అన్నారు. రెండు తెలుగురాష్ట్రాల్లో టిడిపి తుడిచిపెట్టుకుపోయింది వ్యాఖ్యానించారు. 

కొంతమంది చంద్రబాబుకు భజన చేసేవాళ్ళు చెబుతుంటారు.. కష్టాల్లో ఉన్న టీడీపీని ఎన్టీఆర్ నుంచి తీసుకుని చంద్రబాబు విజయవంతంగా నడిపిస్తున్నారు అని. కానీ వాస్తవం వేరు. ఎన్టీఆర్ హయాంలో టిడిపి అత్యధిక మెజారిటీతో విజయం సాధించింది. కానీ బాబు హయాంలో అంతటి భారీ విజయం టిడిపికి ఎప్పుడూ నమోదు కాలేదు. 2014లో కూడా కేవలం స్వల్ప తేడాతో టిడిపి గట్టెక్కింది. కావున బాబు వల్ల టిడిపికి ఒరిగింది ఏమీ లేదని నాని అన్నారు. 

ప్రస్తుతం రెండు తెలుగురాష్ట్రాల్లో టీడీపీ పరిస్థితి డిజాస్టర్ అని నాని అభివర్ణించారు. భవిష్యత్తులో రాష్ట్రంలో టిడిపి ఉండే పరిస్థితి కనిపించడం లేదు. అన్ని రాష్ట్రాల్లో తమ ప్రభావం ఉండేలా మోడీ , అమిత్ షా బిజెపిని విస్తరిస్తున్నారు. భవిష్యత్తులో వైసీపీకి బిజెపి ప్రధాన ప్రత్యర్థి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా నందమూరి కుటుంబం కళ్ళు తెరచి టీడీపీ పగ్గాలు చెప్పాట్టాలి. 

జూ. ఎన్టీఆర్ నా స్నేహితుడే. అతడితో రాజకీయాలు ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ హీరోగా ఎన్టీఆర్ కు ఇంకా భవిష్యత్తు ఉంది. ఎన్టీఆర్ ఇప్పుడే రాజకీయాలు గురించి ఆలోచిస్తాడని అనుకోను. కానీ జూ.ఎన్టీఆర్ కానీ, నందమూరి కుటుంబసభ్యులు కానీ సినిమాలు, తమ పనులు చూసుకుని తీరిగ్గా రాజకీయాల్లోకి వద్దామనుకుంటే కుదరదు. వీలైనంత త్వరగా ఎన్టీఆర్ కుటుంబసభ్యులు టిడిపి పగ్గాలు చెప్పట్టాలి. లేకుంటే ఆ పార్టీ భవిష్యత్తులో ఉండదని నాని అన్నారు. 

click me!
Last Updated May 25, 2019, 7:40 AM IST
click me!