కొడాలి నాని, వల్లభనేని వంశీతో సంబంధాలు లేవు - మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్

Published : Mar 21, 2024, 02:28 PM IST
కొడాలి నాని, వల్లభనేని వంశీతో సంబంధాలు లేవు - మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్

సారాంశం

తనకు కొడాలి నాని, వల్లభనేని వంశీతో ఎలాంటి సంబంధాలు లేవని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. టీడీపీ టిక్కెట్ తనకే వస్తుందని ఆశిస్తున్నాని అన్నారు.

కొడాలి నాని, వల్లభనేని వంశీతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. పట్టాభిపై, పార్టీ కార్యాలయంపై దాడికి ప్రయత్నాలు చేస్తున్నారని ముందే చెప్పానని తెలిపారు. తనకు వంశీ, కొడాలి తో సంబంధంలేదని పిల్లల మీద ప్రమాణాలు చేసి చెబుతున్నానని అన్నారు. భువనేశ్వరి మీద వంశీ ఆరోపణలు చేసినపుడే సర్వస్వం కోల్పోయావని వంశీకి మెసేజ్ చేశానని చెప్పారు. 

కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకుంది..అందుకే సంస్థలపై విమర్శలు - జేపీ నడ్డా

పార్టీ కోసం పని చేయటమే తనకు తెలుసని అన్నారు. పని చేయడం రాని వాళ్ళు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని బోడె ప్రసాద్ అన్నారు. పోటీ చేయటం కోసం ఇలాంటి ప్రచారాలు చేయాలా అని ప్రశ్నించారు. టీడీపీ టికెట్ తనకే వస్తుందని ఇప్పటికీ నమ్ముతున్నానని అన్నారు. అధిష్టానం తీసుకునే నిర్ణయం బట్టి నేను పోటీ చేసే విషయం ఆధారపడి ఉంటుందని తెలిపారు.

సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పిన పతంజలి.. ఎందుకంటే ?

బాధలో నేను ఏదైనా మాట్లాడి ఉంటే అధిష్టానాన్ని క్షమాపణలు కోరుతున్నానని బోడే ప్రసాద్ తెలిపారు. తన కంటే బెటర్ అభ్యర్ధి దొరుకుతారని పార్టీ సర్వే చేస్తున్నారని భావిస్తున్నానని చెప్పారు. ఖచ్చితంగా టికెట్ తన కేటాయిస్తారని నమ్మకం ఉందని అన్నారు. అన్నం తినేవాడు ఎవరైనా వైసీపీలో చేరతారా అని వంశీ అన్నారని, తాను బోండా ఉమా కూడా వంశీ తో మాట్లాడటం లేదని అన్నారు. తామె కలవటం ఎవరైనా చూస్తే దమ్ముంటే చెప్పాలని సవాల్ విసిరారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Speech: తిరుపతి వెడ్డింగ్ హబ్ గా తయారవుతుంది | Wedding Hub | Asianet News Telugu
Chandrababu: స్వర్ణ నారావారిపల్లెకు శ్రీకారం చుట్టాం.. జీవనప్రమాణాలు పెంచాలి | Asianet News Telugu