నందమూరి బాలకృష్ణ : బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం.. 

By Rajesh KarampooriFirst Published Mar 21, 2024, 7:23 AM IST
Highlights

Nandamuri Balakrishna Biography: ఆయన పేరు చెబితే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. ఆయన సినిమా విడుదలయితే బాక్స్ ఆఫీస్ షేక్ కావాల్సిందే.  అతడు మాట్లాడితే కుండబద్దలు కొట్టినట్లే. తన తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో విజయపరంపరను సాగిస్తున్న నాయకుడు అతడే హిందూపురం ఎమ్మెల్యే, నటసింహం నందమూరి బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత, సినీ, రాజకీయ జీవిత విశేషాలు మీ కోసం..
 

Nandamuri Balakrishna Biography: 

బాల్యం, విద్యాభ్యాసం

1960 జూన్ 10న నందమూరి తారక రామారావు - బసవతారకం దంపతులకు జన్మించాడు నందమూరి బాలకృష్ణ. తండ్రి సినిమాను చూస్తూ పెరిగిన బాలకృష్ణకి ఎన్టీఆర్ అంటే ఎంతో ప్రేమ, భక్తి.  ఎన్టీ రామారావు గారి 12 మంది సంతానంలో బాలకృష్ణ ఆరవ కుమారుడు‌‌. బాలకృష్ణకి నలుగురు అన్నయ్యలు జై కృష్ణ ,సాయి కృష్ణ, హరికృష్ణ ,మహాకృష్ణ, ఇద్దరు తమ్ముళ్ళు రామకృష్ణ, జయశంకర్ కృష్ణ. అలాగే.. నలుగురు సోదరీమణులు లోకేశ్వరి, భువనేశ్వరీ, పురందేశ్వరి, ఉమామహేశ్వరి. బాలకృష్ణ బాల్యం హైదరాబాదులో గడిచింది. ఇంటర్మీడియట్ చదువు పూర్తయిన వెంటనే నటుడు కావాలని కోరుకున్నాడు. కానీ కనీసం డిగ్రీ అయినా పూర్తి చేయాలనే తండ్రి కోరికను మన్నించి నిజాం కళాశాలలో డిగ్రీ చదివాడు. 

సినీ జీవితం
 
బాలకృష్ణ..తన పద్నాలుగేళ్ళ వయసులో తండ్రి ఎన్.టి.ఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మకల (1974) చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు. మొదట్లో వివిధ సినిమాల్లో సహాయనటుడిగా కనిపించాడు. తర్వాత తండ్రితో కలిసి నటించిన చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన కథనాయకుడు కాకముందు  తాతమ్మ కల, దాన వీర శూర కర్ణ, అక్బర్ సలీమ్ అనార్కలి, శ్రీమద్విరాట పర్వము, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం సినిమాల్లో తన తండ్రితో కలిసి నటించారు. ఈ చిత్రాలకు ఎన్. టి. ఆర్ దర్శకత్వం వహించడం మరో విశేషం. బాలకృష్ణ ఎంత పెద్ద డైలాగ్ లు అయినా .. సంస్కృత శ్లోకాలు అయినా అలవోకగా వల్లిస్తారు. ఆయన జ్ఞాపకశక్తి అమోఘం.  

ఆ తర్వాత హీరోగా పరిచయం చేయాలని ఎన్టీఆర్ నిర్ణయించుకొని  పలువురు డైరెక్టర్స్ ని వడపోసి పి.వాసుని ఎంపిక చేశారు. అయితే వాసు గారి తన మిత్రుడు భారతి చంద్రతో కలిసి దర్శకత్వం చేస్తానని ఎన్టీఆర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. అందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో .. 1984లో బాలకృష్ణ తన 24 ఏండ్ల వయసులోనే సాహసమే జీవితం అనే సినిమాలో మొదటిసారి హీరోగా నటించారు. ఎన్టీఆర్ వారసుడుగా తెరంగేట్రం చేసినా నటనలో మాత్రం బాలకృష్ణని ఎవరు ఎంచలేదు.  

బాలకృష్ణ  రెండవ సినిమా తాతినేని ప్రసాద్ గారు దర్శకత్వంలో వచ్చిన డిస్కో king. మూడవ సినిమా జనని జన్మభూమి కు విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ మూడు సినిమాలు ఎన్టీఆర్ వారసుడుగానే ప్రేక్షకులు గుర్తించారు. ఆ కారణంతోనే బాలయ్య సినిమాలు చూశారు. కానీ, మంగమ్మగారి మనవడు సినిమా తన నట జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ సినిమాలో నాయనమ్మగా భానుమతి గారు,  హీరోయిన్ గా సుహాసిని నటించారు. ఈ సినిమా టాలీవుడ్ చరిత్రలో చెప్పుకోదగ్గ సినిమాగా..  బాలయ్య కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచింది.

ఆ తరువాత బాలయ్య బాబు తన విజయాల పరంపరని కొనసాగించారు. 1991 లో సింగీతం శ్రీనివాస్ గారు దర్శకత్వంలో వచ్చిన ఆదిత్య 369 తో రెండు విభిన్న పాత్రలు చేసి అంతవరకు తెలుగులో రాని కథలో నటించి బాలకృష్ణ అంటే ఏంటో మరొకసారి నిరూపించుకున్నారు. ఇందులో శ్రీకృష్ణదేవరాయల పాత్రలో నటించి.. తండ్రికి తగ్గ తనయుడని నిరూపించుకున్నారు. ఇక 1994లో వచ్చిన భైరవద్వీపం సినిమాతో బాలయ్య రెండు వైవిధ్యమైన పాత్రలో నటించారు. ఇందులో ఒకటి వికారమైన కూని పాత్ర, మరొకటి  రాకుమారుడు పాత్రలో ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులలో తనకి ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించి పెట్టింది. 

 ఆ తర్వాత 1997 లో వచ్చిన పెద్ద అన్నయ్యలో సెటిమెంట్ పండించి అందరిని ఏడిపించారు. ఇక 1999లో బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన సమరసింహారెడ్డి అప్పటివరకు ఉన్న తెలుగు సినిమా  మార్కెట్లో ఒక ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమా సృష్టించిన రికార్డ్ ఇప్పటికే కొన్ని చెక్కు చేరడం లేదు. ఇక 2001లో వచ్చిన నరసింహనాయుడు కూడా బాలకృష్ణ కెరీర్ లో ఓ మైల్ స్టోన్. ఆ తర్వాత వచ్చిన సింహం, చెన్నకేశవరెడ్డి రెండు మంచి కథలైనా తొందర తొందరగా నిర్మించాలని ఒత్తిడితో అనుకున్నంతగా తీయలేకపోయారు. దాంతో భారీ హిట్లు అందుకోలేకపోయాయి. 

ఆ తర్వాత లక్ష్మీ నరసింహ సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా 100 రోజులు ఆడాల్సిన కొన్ని సెంటర్లలో 80 రోజులకి 95 రోజులకే తీసేసారనీ, ఈ విషయమై  బెల్లంకొండ సురేష్ కి బాలయ్యకు ఓ ఫైట్ జరిగింది. అప్పట్లో అది ఓ సంచలనం.  ఆ తరువాత 2004 నుండి 2009 వరకు ఈ ఐదు సంవత్సరాలు బాలయ్య కెరీర్ లో గడ్డికాలమని చెప్పాలి. ఆయన ఏ సినిమా చేసినా ఫ్లాప్ అయ్యింది. బాలయ్య గ్రాఫ్ కూడా కొంత తగ్గిందనే చెప్పాలి. కానీ 2010లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సింహా సినిమాలో బాలయ్య  తన నట విశ్వరూపం చూపించాడు. అలాగే.. 2014లో మళ్ళీ బోయపాటి దర్శకత్వంలో వచ్చిన  లెజెండ్ సినిమా బాక్సాఫీస్ నిషేక్ చేసింది. 

2014 తర్వాత వచ్చిన లయన్,  డిక్టేటర్ సినిమాలు  పర్వాలేదనిపించాయి. ఇక తన 100వ సినిమాకి ఎందరో డైరెక్టర్స్ ని అనుకొని చివరికి బోయపాటి మీదుగా క్రిష్ చేతిలోకి వచ్చింది.  క్రిష్ కూడా చాలా శ్రద్ధతో బాలయ్య   సినీ కెరీర్ లో ఓ ఆణిముత్యంలా ఉంటే..  గౌతమీపుత్ర శాతకర్ణి అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాతో బాలయ్య నిజంగానే చరిత్ర సృష్టించారు. ఇక 2019వ సంవత్సరంలో ఎన్టీ రామారావు గారి బయోగ్రఫీ ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల్లో తన తండ్రి పాత్రను అద్భుతంగా పోషించి, అందరి ప్రశంసలు అందుకున్నారు. 

రాజకీయ జీవితం

న‌ట‌న‌తో పాటు రాజ‌కీయాల్లోనూ కొన‌సాగుతున్నారు బాల‌కృష్ణ. 2014 శాసనసభ ఏన్నికలలో మొదటి సారి నందమూరి కుటుంబానికి అత్యంత సెంటిమెంట్ అయిన హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 16,000 ఓట్ల పైగా ఆధిక్యతతో గెలుపొందారు.  తమ సినిమాల వలన అందుబాటులో లేకపోతే తన తరఫునుండి ఒక నాయకుడిని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంచారు.  ఇక 2019లో జరిగిన ఎన్నికల్లో టిడిపి పార్టీ 90% బలహీనపడిన బాలయ్య మాత్రం హిందూపురంలో 100% నిరూపించుకున్నాడు.  

తన 45 యేండ్ల సినీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను ఒక్కేలా చూశారు. అలాగే కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడడం ఒక్క బాలయ్యకే సాధ్యం అతని తరువాతే ఎవరైనా. హిట్ ఫ్లాప్ లను లెక్కచేయని  ఒకే ఒక్క హీరో బాలయ్యనే. పబ్లిసిటీ కోరుకోడు. తన తల్లి క్యాన్సర్ తో మరణించారని ఆమె పేరు మీద బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ తన తండ్రి నిర్మిస్తే దానికి బాలయ్య చైర్మన్గా బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తిస్తున్నాడు. 

అవార్డులు

>> 1994లో భైరవద్వీపం చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా ఫిలింఫేర్ అవార్డు. 

>> నరసింహనాయుడు( 2001) సింహా (20100 లెజెండ్ (2014) చిత్రాలకు గానూ ఉత్తమ నటుడిగా నంది అవార్డు 
>> నరసింహనాయుడు చిత్రానికి గాను బెస్ట్ యాక్టర్ అవార్డు. 

>> 2007లో అక్కినేని అభినయ పురస్కారం

>> పాండురంగడు, సింహ , శ్రీరామరాజ్యం చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా భరతముని అవార్డు.

>> లెజెండ్ చిత్రానికి గాను 2014 ఉత్తమ కథానాయకుడిగా నంది అవార్డు కూడా లెజెండ్ మూవీకి నంది వచ్చింది. 

>> 2019వ సంవత్సరంలో ఎన్టీ రామారావు గారి బయోగ్రఫీ ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల్లో తన తండ్రి పాత్రను అద్భుతంగా పోషించి  ప్రశంసలు అందుకున్నారు.

బాలకృష్ణ బయోడేటా 

పూర్తి పేరు: నందమూరి బాలకృష్ణ
పుట్టిన తేది: 10 జూన్ 1960 (వయస్సు 64)
పుట్టిన స్థలం: మద్రాసు
పార్టీ పేరు: తెలుగు దేశం
చదువు:  డిగ్రీ పట్టాభద్రుడు
వృత్తి: సినిమా నటుడు, రాజకీయ నాయకుడు
తండ్రి పేరు:     ఎన్టీ రామారావు
తల్లి పేరు    : బసవతారకం 
జీవిత భాగస్వామి: వసుంధరా దేవి
 

click me!