‘సచ్చిపోయిన పార్టీ మాకేం డెడ్ లైన్లు పెడతది.. వెళ్లి మోడీకి పెట్టమనండి’.. పవన్ పై కొడాలి నాని ఫైర్... (వీడియో)

By AN TeluguFirst Published Nov 2, 2021, 2:35 PM IST
Highlights

మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. జనసేన అధినేత Pawan Kalyan కు జ్ఞానోదయం కలిగిందన్నారు. 

గుడివాడ : రాష్ట్రంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు భయపడే వ్యక్తులు, శక్తులు ఎవరూ లేరని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. 

"

మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. జనసేన అధినేత Pawan Kalyan కు జ్ఞానోదయం కలిగిందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నేపథ్యంలో ఉద్యమం చేయడానికి ఇప్పటికైనా ముందుకు వచ్చారని, పవన్ కళ్యాణ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని Kodali Nani చెప్పారు. 

రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి డెడ్ లైన్లు పెట్టడం కాదన్నారు. చనిపోయిన పార్టీ జనసేన మాకు డెడ్ లైన్లు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్ళి 
Narendra Modiకి డెడ్ లైన్లు  పెట్టమనండంటూ సలహా ఇచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వారం రోజుల్లో ఆపకపోతే ఏదో ఒకటి చేస్తానంటూ గతంలో నటించిన జానీ వంటి పాత సినిమాలను వాళ్ళకు చూపించాలన్నారు. వాటిని చూసి నరేంద్రమోడీ భయపడతారేమో చూడాలన్నారు. 

Janasena చచ్చిపోయిన పార్టీ కాబట్టి పవన్ కళ్యాణ్ డెడ్ లైన్లు పెట్టుకుంటాడన్నారు. అది డెడ్ పార్టీ కదా, రెండు చోట్ల పోటీ చేసి ఆయనే గెలవలేదని అన్నారు. చచ్చిన పార్టీ డెడ్ లైన్లు పెట్టక ఏ లైన్లు పెడుతుందని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు.

ప్రజలు సంక్షేమ పాలనకే పట్టం కట్టారు.. పవన్ మాటల వెనక ఉద్దేశం ఏమిటి..?.. గడికోట శ్రీకాంత్ రెడ్డి

ఇదిలా ఉండగా.. 
బద్వేల్ నియోజకవర్గంలో వైసీపీ విజయం ప్రజా విజయం అని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వైసీపీ ప్రజలను నమ్ముకున్న పార్టీ అని చెప్పారు. సంక్షేమ పాలనకే ప్రజలు పట్టం కట్టారని అన్నారు. సీఎం జగన్ నాయకత్వానికి, వైసీపీకి పెద్ద ఎత్తున మద్దతిచ్చినందుకు ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు.  

బద్వేల్‌లో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ విజయం సాధించిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ సంక్షేమం పాలన వల్ల తాము గడప గడపకు వెళ్లి ఓట్లు అడిగగాలమని చెప్పారు. ప్రజా తీర్పును గౌరవించాలని, ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని ప్రతిపక్షాలను కోరారు.  ఈ విజయంతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. టీడీపీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. బీజేపీ వెనకాల నుంచి మొత్తం నడిపించిందని ఆరోపించారు. 

అంతేకాదు.. పవన్ కల్యాన్ ఇష్టానుసారం మాట్లాడతారు. పవన్ మాటల్లో క్లారిటీ లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని పవన్ కల్యాన్ చెప్పడం వెనక ఆయన ఉద్దేశం ఏమిటి..?. బీజేపీతో కలిసి పోటీ చేస్తామని చెప్పిన పవన్.. వారి వద్ద నుంచి ఏమి వాగ్దానం తీసుకుంటున్నారు..?. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైసీపీ ఎంపీలు ప్రతి రోజు నిరసన తెలిపారు’అని చెప్పారు. ఇక, బద్వేల్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దాసరి సుధ భారీ విజయం సాధించారు. 90 వేలకు పైగా మెజారిటీ ఆమె విజయం సొంతం చేసుకున్నారు. 

click me!